Special MangoTree: ఈ మామిడి చెట్టుకి Z + కి మించిన సెక్యూరిటీ.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!

Special MangoTree: ఈ మామిడి చెట్టుకి Z + కి మించిన సెక్యూరిటీ.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..!

Anil kumar poka

|

Updated on: Apr 07, 2022 | 8:36 AM

మామిడిపండు తినని వేసవికాలాన్ని ఊహించుకోలేం. ఎండాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో ఎక్కడ చూసినా మామిడి పండ్లు దర్శనమిస్తాయి. గ్రామాల్లో నివసించే ప్రజలు మామిడి పండ్లను నేరుగా చెట్ల నుంచే కోసి తింటారు.



మామిడిపండు తినని వేసవికాలాన్ని ఊహించుకోలేం. ఎండాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో ఎక్కడ చూసినా మామిడి పండ్లు దర్శనమిస్తాయి. గ్రామాల్లో నివసించే ప్రజలు మామిడి పండ్లను నేరుగా చెట్ల నుంచే కోసి తింటారు. చాలా మంది వాటిని పక్వానికి కూడా రానివ్వరు. మామిడి పండ్లంటే అంత ఇష్టం మరి. చాలమంది బాల్యంలో మామిడిపండ్లని దొంగిలించి తిన్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. అయితే తాజాగా సోషల్‌ మీడియాలో ఓ మామిడిపండు ఫొటో వైరల్‌గా మారింది. ఎందుకంటే దాని భద్రత దృష్ట్యా అది అందరిని ఆకర్షిస్తోంది. Z + సెక్యూరిటీ అంటే ఆ మామిడి చుట్టూ తేనెటీగలు కాపాలాకాస్తున్నాయి. దీంతో అటువైపు వెళ్లడానికి ఎవరూ సాహసించడం లేదు. దీంతో అందరు ఆ మామిడి చెట్టుకి Z + సెక్యూరిటీ ఉందని ఫన్నీగా చెప్పుకుంటున్నారు.

తేనెటీగల సంగతి దాదాపు అందరికి తెలిసిందే. వాటిని వేధించడం అంటే కష్టాలని కొని తెచ్చుకోవడమే అవుతుంది. ఎందుకంటే అవి కొరికితే చాలా మంటగా ఉంటుంది. ఆ నొప్పిని భరించడం చాలా కష్టం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పరిస్థితులు నెలకొంటాయి. అలాంటి తేనెటీగలు ఇప్పుడు ఆ చెట్టుని కాపాడుతున్నాయి. ఇప్పుడు ఆ చెట్టు మామిడి కాయలు కోయాలంటే మామూలు విషయం కాదు. ఈ ఫన్నీ ఫొటోని ఒక వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనికి క్యాప్షన్ కూడా పెట్టాడు. ‘ఈ సీజన్‌లో మొదటి మామిడి. అది కూడా పచ్చ భద్రతతో’ అని రాశాడు. వార్త రాసే సమయానికి ఈ ఫొటోని 40 వేల మందికి పైగా వీక్షించారు. ఈ చిత్రాన్ని చూసిన తర్వాత నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. చాలా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మీరు కూడా ఈ చిత్రాన్ని చూస్తే మీ కామెంట్‌ తెలపండి.

మరిన్ని చూడండి ఇక్కడ:
Dog singing Video: వావ్ వాట్ ఏ సింగింగ్ రెయ్.. పియానో వాయిస్తూ పాటపాడిన శునకం.. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..

Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్‌..

అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్‌ జాక్సన్‌ స్టెప్‌ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్‌…

Viral Video: అయ్యా..! చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిన 200 మంది.. వీడియో చుస్తే షాక్ అవుతారు..

Funny Video: చిన్న పిల్లలా ఎంజాయ్‌ చేద్దామనుకుంటే సీన్‌ రివర్స్‌ అయిందిగా…! నవ్వులు పూయిస్తున్న వీడియో…

Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..

Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము

Published on: Apr 07, 2022 08:27 AM