Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము
పాము రూపంలో వచ్చిన మృత్యువు ఆమెను మూడు సార్లు వెంటాడింది. ఏడునెలల వ్యవధిలో పాము మూడు సార్లు ఆమెను కాటేసింది. అయితే.. పాము కాటుకు గురైన ఆమె రెండు సార్లు కోలుకున్నా.. మూడో సారి ఆమె విధికి తలొంచాల్సి వచ్చింది. పాము కాటుతో యువతి మృతిచెందిన విషాద ఘటన ఆదిలాబాద్
పాము రూపంలో వచ్చిన మృత్యువు ఆమెను మూడు సార్లు వెంటాడింది. ఏడునెలల వ్యవధిలో పాము మూడు సార్లు ఆమెను కాటేసింది. అయితే.. పాము కాటుకు గురైన ఆమె రెండు సార్లు కోలుకున్నా.. మూడో సారి ఆమె విధికి తలొంచాల్సి వచ్చింది. పాము కాటుతో యువతి మృతిచెందిన విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా బేల మండలం బెదోడ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భలేరావు సుభాష్ దంపతుల ఏకైక కుమార్తె ప్రణాళి ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అయితే.. గతేడాది సెప్టెంబరులో ఇంట్లో నిద్రిస్తుండగా చేతిపై పాము కాటు వేసింది. అప్పుడు దాదాపు 4 లక్షల వరకు ఖర్చు చేసి ఆమెను తల్లిండ్రులు బతికించుకున్నారు. రెండోసారి ఈ ఏడాది జనవరిలో ఇంటి ఆవరణలో కూర్చొని ఉండగా పాము కాటువేసింది. సకాలంలో చికిత్స అందించడంతో తిరిగి కోలుకుంది.ఈ క్రమంలో మార్చి 18న హోలీ పండగ రోజు స్నేహితులతో హోలీ ఆడుకునేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఇంట్లో బ్యాగులోని రంగులను తియబోతుండగా అందులో నక్కి ఉన్న పాము ఒక్కసారిగా ఆమెను కాటు వేసింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు ఆమెను హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ యువతి మరణించింది. ఒక్కగానొక కుమార్తె మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే.. ప్రణాళిని రెండుసార్లు పౌర్ణమి రోజున, ఒకసారి అమావాస్య రోజున పాము కాటేసిందంటూ కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: బస్‌స్టాప్‌లో అదేం పని రా బాబు.! సోషల్ మీడియాలో వీడియో వైరల్.!
viral Video: ఇంటి అద్దె కట్టలేక ఆఫీసులోనే మకాం పెట్టేసాడు.. తర్వాత ఏమైందంటే..?
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
చిరుత నోట్లో చిన్నారి.. ఒట్టి చేతులతో పోరాడిన తండ్రి
బంపర్ ఆఫర్.. సిమ్ కొంటే పెట్రోల్ ఫ్రీ
భయం.. భయం.. నల్లటి ఇసుకతో దెయ్యాల బీచ్
శ్రీ వాసవీ మాతకు 102 ఋషి గోత్ర నామాలతో భారీ రుద్రాక్ష మాల సమర్పణ
పాల డబ్బాలో ఇరుక్కున్న తల.. ! రీల్స్ కోసం కష్టాలు..
స్వేచ్ఛ కోసం ఓ కుటుంబం సుదీర్ఘ పోరాటం.. చివరకు..
భార్య కోసం సర్వస్వం అర్పించిన భర్త కన్నీటి గాథ

