viral Video: ఇంటి అద్దె కట్టలేక ఆఫీసులోనే మకాం పెట్టేసాడు.. తర్వాత ఏమైందంటే..?
కరోనా నేపథ్యంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించడమో లేక జీతాలు తగ్గించడమో చేయడంతో...ఎంతోమంది జీవితాలు ఆగమయ్యాయి. సోషల్‌మీడియాలో నిత్యం ఎంతో మంది ఈ సమస్యపైనే పోస్టులు పెడుతున్నారు. కాగా, సైమన్ అనే ఓ ఉద్యోగి తను ...
కరోనా నేపథ్యంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగించడమో లేక జీతాలు తగ్గించడమో చేయడంతో…ఎంతోమంది జీవితాలు ఆగమయ్యాయి. సోషల్‌మీడియాలో నిత్యం ఎంతో మంది ఈ సమస్యపైనే పోస్టులు పెడుతున్నారు. కాగా, సైమన్ అనే ఓ ఉద్యోగి తను చేసిన ఓ వింత పనితో సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాడు. తన కంపెనీ ఇచ్చే జీతం ఇంటి అద్దెకు కూడా సరిపోవడం లేదని మూటాముల్లెతో సహా ఆఫీసుకి మకాం మార్చేశాడు. తన సామాను అంతా మూడు బ్యాగుల్లో సర్దేసుకుని ఆఫీసులో వాలిపోయాడు. తను పనిచేస్తున్న క్యాబిన్‌లోనే మకాం పెట్టాడు. తన క్యాబిన్‌లో సామాను సర్దుతున్న వీడియో టిక్‌టాక్‌లో వైరల్ అయ్యింది.తన ఆఫీస్ క్యాబిన్‌నుంచే అతను తన దినచర్యను ప్రారంభించాడు. డెయిలీ అప్‌డేట్స్‌ను టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు. అదే అతని కొంప ముంచింది.. అతని ఉద్యోగానికే ఎసరు పెట్టింది. తన వస్తువులు, ఆహారం నిల్వ చేసుకున్న విధానం, బట్టలు సర్దుకుంటున్న తీరును అంతా వీడియో తీసి, టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు. దీంతో అతడికి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. ఇంతవరకూ బాగానే ఉన్న నాలుగోరోజున అతడిని ఆఫీస్‌నుంచి పంపిచేశారట ఆ కంపెనీ వాళ్లు. అనంతరం అతడు పోస్ట్ చేసిన వీడియో క్లిప్స్‌ను కూడా తొలగించాలని ఆదేశించారట. దాంతో ఇక ఆ కంపెనీతో తనకు రుణం తీరిపోయిందని, ఎప్పుడు ఉద్యోగం నుంచి తీసేస్తారోనని భయంభయంగా ఉందంటున్నాడు. అద్దె కట్టలేకపోతే జీతం పెంచమని అడగాలి కానీ… అతను చేసిన పని కరెక్ట్ కాదుకదా.. అదే అంటున్నారు నెటిజన్లు కూడా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్‌న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

