Disha Patani: ట్రిపుల్ కిక్స్‌తో అదరగొడుతున్నదిశాపటానీ.. నెట్టింట వైరల్ అవుతున్న వర్కౌట్ వీడియో..
బాలీవుడ్ నటి దిశాపటానీ ఫిట్‌నెస్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు. అందుకు యోగా, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ తోపాటు ఆత్మరక్షణ విద్య అయిన కిక్ బాక్సింగ్‌లోనూ మంచి నైపుణ్యం సంపాదించారు. దిశ చేసే వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియోలను...
బాలీవుడ్ నటి దిశాపటానీ ఫిట్‌నెస్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉంటారు. అందుకు యోగా, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ తోపాటు ఆత్మరక్షణ విద్య అయిన కిక్ బాక్సింగ్‌లోనూ మంచి నైపుణ్యం సంపాదించారు. దిశ చేసే వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియోలను తరుచూ ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా, ఆమె పెట్టిన కిక్‌బాక్సింగ్ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. స్లో మోషన్‌లో వచ్చి ట్రిపుల్ కిక్స్ ఇచ్చే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీంతో ఆమె ఫాలోవర్స్ అందరూ కిక్‌బాక్సింగ్‌పై ఆసక్తిచూపుతున్నారు.కిక్‌బాక్సింగ్ అనేది అనేక ఆరోగ్యప్రయోజనాలతో కూడిన ఫిట్‌నెస్ వర్కౌట్. ఇది శరీరానికి అవసరమైన మంచి శక్తిని పెంపొందించడమే కాకుండా… కండరాల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. దీనివల్ల అధిక కెలోరీలు బర్న్ చేయొచ్చు. కిక్‌బాక్సింగ్ చేయడం వల్ల మంచి శరీరాకృతి సొంతమవుతుంది. అంతేకాదు గుండె సంబంధిత వ్యాధులను అరికట్టడంలో బాగా పనిచేస్తుంది.వారానికి మూడురోజులు ఒక గంటపాటు కిక్ బాక్సింగ్ సాధన చేస్తే ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. గుండె బలోపేతమవుతుంది. వీటితోపాటు కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అధిక బరువును తగ్గించుకోవచ్చు. కాన్ఫిడెన్స్ లెవల్ పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. బాగా నిద్రపడుతుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)