AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

North Korea: నేరుగా అణ్వాయుధాలే వాడతాం.. మాతో పెట్టుకోవద్దంటూ కిమ్ సోదరి తీవ్ర హెచ్చరిక..

Kim Yo Jong: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) సోదరి కిమ్ యో జోంగ్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇప్పటికే వరుస క్షిపణి పరీక్షలతో దూసుకుపోతున్న నార్త్ కొరియా నుంచి మరో తీవ్ర హెచ్చరిక వచ్చింది.

North Korea: నేరుగా అణ్వాయుధాలే వాడతాం.. మాతో పెట్టుకోవద్దంటూ కిమ్ సోదరి తీవ్ర హెచ్చరిక..
North Korea
Ayyappa Mamidi
|

Updated on: Apr 05, 2022 | 2:37 PM

Share

Kim Yo Jong: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) సోదరి కిమ్ యో జోంగ్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇప్పటికే వరుస క్షిపణి పరీక్షలతో దూసుకుపోతున్న నార్త్ కొరియా నుంచి దక్షిణ కొరియాకు తీవ్ర హెచ్చరికలు వచ్చాయి. ఈ సారి ఏకంగా అణ్వాయుధాల(Nuclear weapons) పేరుతో భయపెట్టే ప్రయత్నం చేశారు కిమ్ సోదరి. దక్షిణ కొరియా సైనిక ఘర్షణకు దిగితే తమ దేశం నేరుగా అణ్వాయుధాలనే ఉపయోగిస్తుందని ఆమె అన్నారు. ఉత్తర కొరియాపై రక్షణాత్మక దాడుల గురించి దక్షిణ కొరియా రక్షణ మంత్రి వ్యాఖ్యానించడం చాలా పెద్ద తప్పుగా ఆమె అన్నారు. దక్షిణ కొరియా సైనిక సంఘర్షణ ప్రారంభిస్తే.. ప్రతిగా ఉత్తర కొరియా ఒక్క బుల్లెట్​ కూడా కాల్చదని.. షెల్లింగుల జోలికి వెళ్లదని ఆమె అన్నారు. ఎందుకంటే మా సాయుధ దళాల సామర్థ్యానికి అవి సరితూగవని వ్యాఖ్యానించారు. అందుకు బదులుగా తమ అణ్వాయుధ దళాలు బదులిస్తాయని తీవ్ర స్థాయిలో హెచ్చిరించారు.

ఇదే సమయంలో సౌత్ కొరియా సైన్యాన్ని పనికిరాని ఆర్మీ అంటూ అభివర్ణించారు కిమ్ సోదరి. తమపై దాడి చేస్తే తప్ప.. దక్షిణ కొరియా సైన్యాన్ని తమ లక్ష్యంగా పరిగణించబోమని అన్నారు. అయితే ఇరుదేశాల్లో వినాశకర పరిస్థితులకు దారితీసే యుద్ధాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. 1950 నాటి పరిస్థితులను తాము కోరుకోవడం లేదని అన్నారు. దక్షిణ కొరియా తదుపరి చర్యల ఆధారంగా పరిస్థితుల్లో మార్పు ఉంటుందని అన్నారు. కొరియన్ సెంట్రల్ కమిటీ వర్కర్స్ పార్టీకి డిప్యూటీ డైరెక్టర్​గా ఉన్న కిమ్ యో జోంగ్.. తన అన్న కిమ్ జాంగ్ ఉన్​కు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటున్నారు. దక్షిణ కొరియా సహా అమెరికాకు సైతం ఆమె తనదైన శైలిలో తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

Burger King: యాడ్‌లో కనిపించిన చికెన్.. బర్గర్‌లో ఏమైంది.. పాస్ట్‌ఫుడ్ దిగ్గజం బర్గర్ కింగ్‌పై కోర్టులో కేసు

Hyderabad Drugs Case: హైదరాబాద్ పుడింగ్ అండ్ మింక్ డ్రగ్స్ కేసులో సంచలనాలు. అతడి కనుసన్నల్లోనే డ్రగ్స్‌ సఫ్లై..!