AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk Edit Button Poll: మస్క్ పోల్ పై ట్విట్టర్ సీఈవో స్పందన.. ఆలోచించి ఓటేయాలని సూచన.. ఎందుకంటే..

Elon Musk Edit Button Poll: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ పోల్ విషయంలో ట్విట్టర్(Twitter) సీఈఓ పరాగ్ అగర్వాల్ కామెంట్ చేశారు. ట్విట్టర్లో ఎలాన్ మస్క్ చేపట్టన ఎడిట్ బటన్ పోల్ వివాదం గురించి ఎందుకు రగడ?

Elon Musk Edit Button Poll: మస్క్ పోల్ పై ట్విట్టర్ సీఈవో స్పందన.. ఆలోచించి ఓటేయాలని సూచన.. ఎందుకంటే..
Elon Musk
Ayyappa Mamidi
|

Updated on: Apr 05, 2022 | 6:19 PM

Share

Elon Musk Edit Button Poll: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ పోల్ విషయంలో ట్విట్టర్(Twitter) సీఈఓ పరాగ్ అగర్వాల్ కామెంట్ చేశారు. ట్విట్టర్లో ఎలాన్ మస్క్ చేపట్టన ఎడిట్ బటన్ పోల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని ఆయన సూచించారు. చాలా మంది ఎడిట్‌ బటన్‌ ఉండాలని చెప్పగా మరికొందరు ఎడిట్‌ బటన్‌తో మజా పోతుందంటున్నారు. అయితే.. ఈ ట్వీట్‌ ఎలాన్‌ మస్క్‌ నుంచి వచ్చిన గంట సేపటికే ట్విట్టర్‌ సీఈవో పరాగ్‌ అగ్రావాల్‌ స్పందించటం విశేషం. ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలతో వస్తారో ఎలాన్ మార్క్ కే తెలియదు. కానీ వాటి ప్రభావం మాత్రం అనేక మందిపై ఉంటాయని చెప్పుకోక తప్పదు. ఈ మధ్య కాలంలో ట్విట్టర్ కు ప్రత్యామ్నాయంగా మరో డిజిటల్ వేధిక గురించి పోల్ నిర్వహించిన ఆయన.. కొద్ది వారాల్లోనే ట్విట్టర్ కంపెనీలో భారీగా పెట్టుబడులు(Investment) పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.

ఎలాన్‌ మస్క్‌ చేసే కామెంట్స్‌ పైకి సరదాగా అనిపించినా.. వాటి వెనుక మాస్టర్‌ ప్లాన్‌ ఉంటుందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. అందువల్లే ట్విట్టర్‌లో ఎడిట్‌ ఫీచర్‌పై మస్క్‌ పెట్టిన పోల్‌లో ఓటు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించుకోవాలని పరాగ్‌ అగ్రావాల్‌ యూజర్లకు సూచించారు. కాగా.. ఇప్పటికే ఎడిట్‌ బటన్‌ ఫీచర్ పై ట్విట్టర్‌ అంతర్గతంగా వర్క్‌ చేస్తోంది.

ప్రస్తుతం మేజర్ షేర్ హొల్డర్ గా ఉన్న మస్క్.. మూడో కంటిక్ తెలియకుండా కంపెనీలో 9.20 శాతం వాటాను చేజిక్కించుకున్నారు. దీని విలువ 3 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓపెన్ మార్కెట్ నుంచి 7.35 కోట్ల ట్విట్టర్ షేర్లను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. లాంగ్ టర్మ్ పెట్టుబడి లాభాల కోసమే ఈ పెట్టుబడిని పెట్టినట్లు తెలుస్తోంది. ఎలాన్ మస్క్ కొనుగోలు తర్వాత ట్విట్టర్ షేర్లకు డిమాండ్ అమాంతం పెరిగింది. నిన్న మార్కెట్ ప్రారంభానికి ముందే ట్విట్టర్ షేర్ 26 శాతం లాభాల్లో ట్రేడ్ అవటం ప్రారంభించింది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు సమస్యలు ఏర్పడుతున్నాయని ట్వీట్ చేసిన కొద్ది రోజులకే మస్క్ ట్విట్టర్ కంపెనీలో వాటాలను కొనుగోలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Multibagger Stock: ఏడాదిలో మదుపరులను కోటీశ్వరులు చేసిన స్టాక్.. ఇంకా ఆగని షేర్ జోరు..

Ban On Youtube channels: కేంద్రం కీలక నిర్ణయం.. 22 యూట్యూబ్‌ ఛానెళ్లపై నిషేధం విధింపు..