AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LIC IPO: మేలో ఎల్‌ఐసీ ఐపీఓ..! 5 శాతానికి బదులు 7 శాతం వాటా విక్రయించాలని యోచన..!

స్టాక్‌ మార్కెట్‌(Stock Market) అస్థిరత వల్ల లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) ఐపీఓ(IPO) గత ఆర్థిక సంవత్సరంలో రాలేకపోయింది...

LIC IPO: మేలో ఎల్‌ఐసీ ఐపీఓ..! 5 శాతానికి బదులు 7 శాతం వాటా విక్రయించాలని యోచన..!
Lic Ipo
Srinivas Chekkilla
|

Updated on: Apr 06, 2022 | 6:45 AM

Share

స్టాక్‌ మార్కెట్‌(Stock Market) అస్థిరత వల్ల లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC) ఐపీఓ(IPO) గత ఆర్థిక సంవత్సరంలో రాలేకపోయింది. తాజా నివేదిక ప్రకారం ప్రభుత్వం మే నెలలో LIC IPOని తీసుకురావచ్చని అంచనా వేస్తున్నారు. ఎకనామిక్ టైమ్స్‌లో ప్రచురించిన కథనం ప్రకారం ఎల్‌ఐసీలో 7 శాతం వాటాను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ IPO సహాయంతో ప్రభుత్వం వచ్చే నెలలో 50 వేల కోట్ల అంటే 6.6 డాలర్ల బిలియన్ల నిధిని సేకరించనుంది. అయితే గతంలో 5 శాతం వాటా మాత్రమే విక్రయించాలని అన్నకున్నా ఇప్పుడు అది ఏడు శాతానికి పెరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మే 12 గడువు కంటే ముందే దీన్ని IPO తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఎల్‌ఐసీ స్పందించలేదు.

మే నెలాఖరు నాటికి రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం సద్దుమణిగి మార్కెట్ గాడిలో పడితే ఈ IPO పట్ల పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్‌ఐసీ డిపాజిట్ చేసిన డీఆర్‌హెచ్‌పీ ప్రకారం ఎంబెడెడ్ విలువకు గడువు మే 12 వరకు ఉంది. అంటే ఈ IPO మే 12 నాటికి వస్తే కొత్త ప్రక్రియను అనుసరించాల్సిన అవసరం ఉండదు. ఈ గడువు ముగిసిన తర్వాత లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అన్ని పత్రాలను మళ్లీ సమర్పించి పొందుపరిచిన విలువను కొత్తగా రూపొందించాలి.

2021-22 ఆర్థిక సంవత్సరంలోనే ఎల్‌ఐసీ ఐపీఓ తీసుకురావాలనేది ప్రభుత్వ ప్రణాళిక. లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఐదు శాతం వాటాను విక్రయించడం ద్వారా 63 వేల కోట్ల నిధిని సేకరించాలని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ లక్ష్యాన్ని 1.75 లక్షల కోట్ల నుంచి 78 వేల కోట్లకు తగ్గించింది. ఈ లక్ష్యాన్ని సాధించడానికి LIC IPO అవసరం. అయితే ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్ ప్రతికూలంగా ప్రభావితమవడంతో స్టాక్‌ మార్కెట్‌లో అస్థరత ఏర్పడింది. దీంతో ప్రభుత్వం IPOను వాయిదా వేయవలసి వచ్చింది.

Read Also..  TCS Hiring: గుడ్ న్యూస్.. ఫ్రెషర్స్ కు టీసీఎస్ అట్లాస్ ఉద్యోగ అవకాశం..