AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Loan Fraud: లోన్ మోసాలపై ఇలా జాగ్రత్త పడండి.. లేకుంటే వారిలా ఇబ్బందిపడతారు..

Loan Fraud: ఆన్‌లైన్‌లో నగదు లావాదేవీలు డిజిటల్ చెల్లింపుల రాకతో అనూహ్యంగా పెరిగాయి. ఇందుకు సంబంధించిన యాప్‌లు విరివిగా అందుబాటులోకి రావడంతో స్మార్ట్‌ఫోన్లతోనే ఆర్థిక కార్యకలాపాలు చేసేస్తున్నారు.

Loan Fraud: లోన్ మోసాలపై ఇలా జాగ్రత్త పడండి.. లేకుంటే వారిలా ఇబ్బందిపడతారు..
Bank Loan
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 06, 2022 | 6:34 AM

Loan Fraud: ఆన్‌లైన్‌లో నగదు లావాదేవీలు డిజిటల్ చెల్లింపుల రాకతో అనూహ్యంగా పెరిగాయి. ఇందుకు సంబంధించిన యాప్‌లు విరివిగా అందుబాటులోకి రావడంతో స్మార్ట్‌ఫోన్లతోనే ఆర్థిక కార్యకలాపాలు చేసేస్తున్నారు. ఇదే అదనుగా నేరగాళ్లు రెచ్చిపోవటంతో ఆన్‌లైన్‌ మోసాలు కూడా పెరిగాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు మోసగాళ్ల బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటుడు రాజ్‌కుమార్‌ రావు పాన్‌కార్డును దుర్వినియోగం చేసి రుణ మోసాలకు పాల్పడ్డారు దుండగులు. గతంలో సన్నీలియోన్‌ కూడా ఇదే తరహాలో మోసగాళ్ల బారిన పడ్డారు. దీంతో వారిద్దరి సిబిల్‌ స్కోర్‌ తగ్గిపోయింది.

అసలు సిబిల్‌ స్కోర్‌ అంటే ఏమిటి.. బ్యాంకులు వ్యక్తిగత రుణాలు మంజూరు చేయడానికి క్రెడిట్‌ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటాయి. క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో ఇండియా లిమిటెడ్‌ ఇచ్చే మూడంకెల సంఖ్యనే సిబిల్‌ స్కోర్‌గా పరిగణిస్తారు. ఈ సంఖ్య 300 నుంచి 900 వర‌కు ఉంటుంది. రుణాలకు సంబంధించిన వ్యక్తిగత ఆర్థిక లావాదేవీల ఆధారంగా ఈ స్కోర్‌ లెక్కిస్తారు. 900 పాయింట్లకు దగ్గరగా మీ స్కోర్‌ ఉంటే తక్కువ వడ్డీకి ఎక్కువ మెుత్తంలో రుణం లభించే అవకాశాలు ఉంటాయి. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే రుణాలు పొందలేక పోవటం లేదా అధిక వడ్డీ రేట్లకు లోన్ పొందటం లాంటివి జరగవచ్చు. అందుకే సిబిల్ స్కోర్ చాలా ముఖ్యమైనది.

రుణ మోసాల నుంచి తప్పించుకోవాలంటే వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా పాటించాలి. క్రెడిట్‌ స్కోర్‌ను రెగ్యులర్‌గా చెక్‌ చేసుకుంటూ ఉండాలి. కనీసం నెలకు ఒకసారైనా క్రెడిట్‌ స్కోరు చూసుకోవడం మంచిది. సిబిల్‌ వెబ్‌సైట్‌ లేదా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా క్రెడిట్‌ స్కోరు తెలుసుకోవచ్చు. మీ పేరు మీద ఎన్ని లోన్స్‌ ఉన్నాయి, ఎంత మొత్తంలో రుణం తీసుకున్నారనే వివరాలు ఇందులో వెల్లడవుతాయి. మీకు తెలియకుండా మీ పేరుపై ఎవరైనా రుణాలు తీసుకున్నట్టు గుర్తించిన వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలి.  క్రెడిట్‌ బ్యూరో వైబ్‌సైట్‌ ద్వారా మీ ఫిర్యాదును ఆర్‌బీఐ దృష్టికి తీసుకెళ్లాలి. ఆన్‌లైన్‌లో cms.rbi.org.inకు ఫిర్యాదు చేయవచ్చు. crpc@rbi..org.inకు ఈ-మెయిల్‌ పంపవచ్చు.

పాటించవలసిన జాగ్రత్తలు..

  1. వ్యక్తిగత ఐడీ వివరాలను, సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయకండి.
  2. ఆధార్‌, పాన్‌కార్డ్‌ లాంటి వాటి వివరాలను ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌లో సేవ్‌ చేయొద్దు.
  3. స్కాన్‌ చేసిన ఆధార్‌, పాన్‌కార్డ్‌ కాపీలను ఈ-మెయిల్‌లో సేవ్ చేసుకోవద్దు.
  4. ఒకవేళ ఈ-మెయిల్‌లో మీ పాన్‌కార్డ్‌ను షేర్‌ చేయాల్సివస్తే incognito మోడ్‌లో బ్రౌజర్‌ను వినియోగించాలి.
  5. గుర్తింపు పత్రాల ఫొటో కాపీలను అటెస్ట్‌ చేసి మాత్రమే వాడాలి.
  6. ప్లబిక్‌ వై-ఫై వినియోగించి ఆన్‌లైన్‌ ట్రాన్‌టాక్షన్స్‌ చేయొద్దు.
  7. పాన్‌కార్డ్‌ ఇమేజ్‌ మీ ఫోన్‌లో ఉన్నట్లయితే.. లోన్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకునేటప్పుడు ఫొటోగ్యాలరీ యాక్సెస్‌ ఇవ్వొద్దు.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి.. Home Loan Interest Rates: హోం లోన్లపై తక్కువ వడ్డీ వసూలు చేస్తున్న బ్యాంకులు ఇవే..

Sri Lanka Crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభం..తెలుగు రాష్ట్రాల నుంచి బియ్యం సరఫరా