Home Loan Interest Rates: హోం లోన్లపై తక్కువ వడ్డీ వసూలు చేస్తున్న బ్యాంకులు ఇవే..

దేశంలోని అతిపెద్ద రుణదాత HDFCని HDFC బ్యాంక్‌తో విలీనంతో ఆర్థిక రంగ షేర్లు పుంజుకుంటున్నాయి...

Home Loan Interest Rates: హోం లోన్లపై తక్కువ వడ్డీ వసూలు చేస్తున్న బ్యాంకులు ఇవే..
Home
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 06, 2022 | 6:15 AM

దేశంలోని అతిపెద్ద రుణదాత HDFCని HDFC బ్యాంక్‌తో విలీనంతో ఆర్థిక రంగ షేర్లు పుంజుకుంటున్నాయి. అయితే రాబోయే RBI మానిటరీ పాలసీ ప్రకటన కారణంగా గృహ రుణ వడ్డీ రేట్లు ప్రభావితం కానున్నాయి. ఇది వెంటనే కాకపోయినా సమీప భవిష్యత్తులో రేట్ల పెంపుదలకు మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు. Bankbazaar.com డేటా ప్రకారం ప్రభుత్వ యాజమాన్యంలోని రుణదాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర చౌకైన గృహ రుణాల(Home loan)ను అందిస్తుంది. రూ. 75 లక్షల 20 సంవత్సరాల గృహ రుణం కోసం 6.4 శాతం వడ్డీ రేటు వసూలు చేస్తున్నారు. పంజాబ్ & సింధ్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, UCO బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు వారి గృహ రుణ గ్రహీతలకు 6.5 శాతం వడ్డీ రేటును అందిస్తోన్నాయి.

20 ఏళ్ల కాలపరిమితితో రూ. 75 లక్షల రుణం కోసం వీళ్లు గృహ రుణ గ్రహీతల EMI మొత్తం రూ. 55,918 వసూలు చేస్తున్నారు. 10 గృహ రుణ దాతల జాబితాలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏకైక ప్రైవేట్ రంగ రుణదాతగా ఉంది. ఈ బ్యాంకు హోమ్ లోన్ రేటు 6.55 శాతం కాగా EMI రూ. 56,139 వసూలు చేస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోం లోన్ గ్రహీతలు నుంచి 6.60 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తారు. 20 సంవత్సరాల కాలవ్యవధితో రూ. 75 లక్షల రుణం కోసం రూ. 56,360 EMIగా తీసుకుంటున్నారు. 6.65 శాతం వడ్డీ రేట్‌తో కెనరా బ్యాంక్ హౌసింగ్ లోన్ ఇస్తుంది. ఈ బ్యాంక్ వడ్డీ రేటు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంటే స్వల్పంగా ఎక్కువ. ఇందులో 20 సంవత్సరాలకు 75 లక్షల రుణం తీసుకుంటే మీరు నెలవారీ రుణ వాయిదా రూ.56,582 చెల్లించాలి.

Read Also.. Rakesh Jhunjhunwala: ఒక్క నెలలో రూ.832 కోట్లు ఆర్జించిన బిగ్ బుల్.. కనక వర్షం కురిపించిన రెండు షేర్లు..