Rakesh Jhunjhunwala: ఒక్క నెలలో రూ.832 కోట్లు ఆర్జించిన బిగ్ బుల్.. కనక వర్షం కురిపించిన రెండు షేర్లు..

Rakesh Jhunjhunwala: భారత స్టాక్ మార్కెట్ బిగ్ బుల్(Big bull), ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా మరో సారి భారీ లాభాలను ఆర్జించారు. గడచిన నెలలో ఏకంగా రూ.832 కోట్లను ఆర్జించారు.

Rakesh Jhunjhunwala: ఒక్క నెలలో రూ.832 కోట్లు ఆర్జించిన బిగ్ బుల్.. కనక వర్షం కురిపించిన రెండు షేర్లు..
Rakesh Jhunjhunwala
Follow us
Ayyappa Mamidi

|

Updated on: Apr 05, 2022 | 5:40 PM

Rakesh Jhunjhunwala: భారత స్టాక్ మార్కెట్ బిగ్ బుల్(Big bull), ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా మరో సారి భారీ లాభాలను ఆర్జించారు. గడచిన నెలలో ఏకంగా రూ.832 కోట్లను ఆర్జించారు. ఆయన సంపదను భారీగా పెంచేందుకు రెండు కంపెనీలు ప్రధాన కారణంగా నిలిచాయి. అవేంటంటే.. Star Health, Metro Brands కంపెనీలే. గత కొద్దిరోజులుగా ఈ స్టాక్స్ గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. ఒక్క నెల కాలంలో Star Health షేర్ విలువ రూ.686.60 నుంచి రూ.741.10కు చేరుకుంది. అదేవిధంగా గత నెలలో Metro Brands షేర్లు రూ.531.95 నుంచి రూ.604కి పెరిగాయి.

Star Healthలో రాకేష్ జున్‌జున్‌వాలా, ఆయన భార్య రేఖా జున్‌జున్‌వాలా కంపెనీలో 10,07,53,935 షేర్లను కలిగి ఉన్నారు. ఇది కంపెనీ మొత్తం వాటాలో 17.50 శాతంగా ఉంది. Metro Brands షేర్ హోల్డింగ్ తీరును పరిశీలిస్తే.. గతేడాది అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు రాకేశ్‌ జున్‌జున్‌వాలా తన భార్య ద్వారా ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. రేఖా జున్‌జున్‌వాలా కుటుంబానికి చెందిన 3 ట్రస్ట్‌ల ద్వారా ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు.

స్టార్ హెల్త్‌లో జున్‌జున్‌వాలా షేర్లను (10,07,53,935) ఒక్కో షేరు పెరుగుదలతో గుణించగా.. ఆయన గత నెలలో ఈ స్టాక్ ద్వారా తన నికర విలువను 550 కోట్లు పెరిగింది. అదేవిధంగా, మెట్రో బ్రాండ్ల షేర్ల ద్వారా రేఖా జున్‌జున్‌వాలా ఒక నెలలో 282 కోట్లు ఆర్జించారు. ఈ రెండూ కలిపితే కేవలం ఒక్క నెల కాలంలో రాకేష్ జున్‌జున్‌వాలా మొత్తం ఆస్తుల విలువ రూ.832 కోట్లు పెరిగాయి. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు ఈ కంపెనీల షేర్లపై బులిష్ గానే ఉన్నాయి. ఈ కంపెనీలకు మరింత ఎక్కువ టార్గెట్ ను సూచిస్తున్నాయి.

పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన ఆసక్తికరమైన వీడియోల వేదిక Money9 Telugu యూట్యూబ్ ఛానెల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి..

Multibagger Stock: ఏడాదిలో మదుపరులను కోటీశ్వరులు చేసిన స్టాక్.. ఇంకా ఆగని షేర్ జోరు..

Income Tax Notices: ఐటీ శాఖ నోటీసును నిర్లక్ష్యం చేస్తున్నారా? భారీ మూల్యం తప్పదు జాగ్రత్త..