Multibagger Stock: ఏడాదిలో మదుపరులను కోటీశ్వరులు చేసిన స్టాక్.. ఇంకా ఆగని షేర్ జోరు..
Multibagger Stock: పోర్ట్ ఫోలియోలో(Portfolio) మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఉంటే.. అవి మదుపరులను ఒక్కోసారి వారిని కోట్లశ్వరులుగా మార్చేస్తుంటాయి. కొన్ని పెన్నీ స్టాక్స్ ఊహకందని రీతిలో స్వల్ప కాలంలోనే భారీగా తమ విలువను పెంచుకుంటుంటాయి.
Multibagger Stock: పోర్ట్ ఫోలియోలో(Portfolio) మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఉంటే.. అవి మదుపరులను ఒక్కోసారి వారిని కోట్లశ్వరులుగా మార్చేస్తుంటాయి. కొన్ని పెన్నీ స్టాక్స్ ఊహకందని రీతిలో స్వల్ప కాలంలోనే భారీగా తమ విలువను పెంచుకుంటుంటాయి. స్టాక్ మార్కెట్లో మల్టీ బ్యాగర్ స్టాక్స్ కోసం ఇన్వెస్టర్లు ఎప్పుడు ఎదురు చూస్తుంటారు. తమ పోర్టుఫోలియోలోని స్టాక్స్ మల్టీ బ్యాగర్లుగా మారాలని కోరుకుంటారు. బలమైన ఫండమెంటల్స్(Strong Fundamentals) ఉన్నటువంటి స్టాక్స్ అలాగే జోరుగా కదిలి ఇన్వెస్టర్లకు కనక వర్షం కురిపిస్తుంటాయి. కొన్ని సందర్బాల్లో కొన్ని స్టాక్స్ వందల రెట్లు పెరగడం కూడా జరగవచ్చు. స్టాక్ ఇన్వెస్టర్ పెట్టుబడిని కేవలం ఒక సంవత్సర కాలంలో రూ. 1 లక్ష నుంచి రూ. 1.58 కోట్లుగా మార్చింది. ఇంతకీ ఆ స్టాక్ ఏమిటా అని ఆలోచిస్తున్నారా..
పైన చెప్పిన మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ కైజర్ కార్పొరేషన్ (Kaiser Corporation). సంవత్సరం కిందట.. ఈ పెన్నీ స్టాక్ లో ఇన్వెస్ట్ చేసిన మదుపరులను ప్రస్తుతం కోటీశ్వరులను చేసింది. ఈ స్టాక్ ఒక్క ఏడాదిలోనే 15,000 శాతానికి పైగా విలువను పెంచుకుంది. ఈ స్టాక్ ప్రభంజనం ఇంకా కొనసాగిస్తోంది. ఏప్రిల్ 5, 2022 ఈ షేర్ 4.98 శాతం మేర పెరిగి బులిష్ జోరును కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ షేర్ విలువ రూ. 60.50 వద్ద ట్రేడ్ అవుతోంది.
కైజర్ కార్పొరేషన్ షేరు ధర (Kaiser Corporation Share Price) 12 ఏప్రిల్ 2021న కేవలం 0.38 పైసల వద్ద ముగిసింది. ఈరోజు స్టాక్ ధర ఒక్కో షేరుకు రూ. 60.05కి చేరుకుంది. ఈ స్టాక్ ఏడాది పొడవునా మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. ఈ కాలంలో స్టాక్ 15,702 శాతం లాభపడింది. ఈ సంవత్సరం కూడా ఈ స్టాక్ ఇప్పటివరకు 1900 శాతం రాబడిని అందించింది. జనవరి 3, 2022న షేర్ ధర రూ. 2.92 ఉండగా.. కానీ ఇప్పుడు రూ.65.50 కి చేరుకుంది. ఒక ఇన్వెస్టర్ ఏడాది క్రితం లక్ష రూపాయల పెట్టుబడి పెట్టి 38 పైసలకు కైజర్ కార్పొరేషన్ షేర్లను కొనుగోలు చేసినట్లయితే.. ప్రస్తుతం మార్కెట్ విలువ ప్రకారం ఆ వాటాల విలువ రూ.1.58 కోట్లకు చేరుకునేది. అదేవిధంగా.. ఇన్వెస్టర్ జనవరి 3, 2022న ఈ స్టాక్‌లో రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే.. ఈరోజు మార్కెట్ విలువ ప్రకారం దాని విలువ రూ.20.56 లక్షలకు పెరిగి ఉండేది.
గమనిక: ఇక్కడ అందిస్తున్న ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. ఆర్ధిక నిపుణులు వెల్లడించిన అభిప్రాయాలు.. ఆయా కంపెనీల పనితీరుపై నిపుణులు అందించిన సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ అందిస్తున్నాం. స్టాక్స్, ఫండ్స్, ఇన్సూరెన్స్ వంటి వాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆర్ధిక నిపుణుల సలహా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
ఇవీ చదవండి..
Ban On Youtube channels: కేంద్రం కీలక నిర్ణయం.. 22 యూట్యూబ్ ఛానెళ్లపై నిషేధం విధింపు..
Income Tax Notices: ఐటీ శాఖ నోటీసును నిర్లక్ష్యం చేస్తున్నారా? భారీ మూల్యం తప్పదు జాగ్రత్త..
Stock Market: ఊగిసలాట మధ్య నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. పతనానికి కారణమైన ఆ షేర్లు..