Stock Market: ఊగిసలాట మధ్య నష్టాల్లో ముగిసిన మార్కెట్లు.. పతనానికి కారణమైన ఆ షేర్లు..
Stock Market: నిన్న భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. నేడు అంతర్జాతీయ కారణాల నడుమ కొద్దిపాటి నష్టాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీ నష్టాల్లో ముగిశాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే..
Stock Market: నిన్న భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. ఈ రోజు అంతర్జాతీయ కారణాల మధ్య కొద్దిపాటి నష్టాల్లో ముగిశాయి. బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్(Sensex) 435 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ(Nifty) సైతం 96 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిన్న హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం వార్తతో పరుగులు తీసిన బ్యాంకింగ్ షేర్ల కారణంగా మార్కెట్లు పరుగులుతీసినప్పటికీ.. ఈ రోజు మాత్రం బ్యాంక్ నిఫ్టీ 567 పాయింట్లు కోల్పోయింది. కానీ నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 420 పాయింట్ల లాభంతో ముగిసింది. ప్రధానంగా సూచీలు నెగెటివ్ లో ముగియటానికి బ్యాంకింగ్ షేర్లలో పతనం కారణంగా నిలిచింది. ఇదే సమయంలో పవర్ సెక్టార్ షేర్లు భారీగా పుంజుకున్నాయి.
నిఫ్టీ సూచీలో అదానీ పోర్ట్స్ 3.60%, ఎన్టీపీసీ 3.33%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 3.03%, టాటా మోటార్స్ 2.53%, పవర్ గ్రిడ్ 2.48%, ఓఎన్జీసీ 2.26%, ఐటీసీ 1.57%, ఐచర్ మోటార్స్ 1.38%, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 1.35%, టైటాన్ కంపెనీ 1.28% మేర లాభ పడి టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.93%, బజాజ్ ఫిన్ సర్వ్ 2.20%, హెచ్డీఎఫ్సీ 2.10%, కోటర్ మహీంద్రా బ్యాంక్ 1.84%, లుపిన్ 1.82%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.41%, ఇండస్ ఇండ్ బ్యాంక్ 1.41%, ఇన్ఫోసిస్ 1.16%, విప్రో 1.07%, జీ ఎంట్రైన్ మెంట్ 0.86% మేర నష్టపోయి టాప్ లూజర్స్ గా నిలిచాయి.
ఇవీ చదవండి..
Income Tax Notices: ఐటీ శాఖ నోటీసును నిర్లక్ష్యం చేస్తున్నారా? భారీ మూల్యం తప్పదు జాగ్రత్త..
Credit Card: క్రెడిట్ కార్డ్ ఇలా ఉపయోగిస్తున్నారా.. అయితే మీ పని ఖాళీనే జాగ్రత్త..
TCS Hiring: గుడ్ న్యూస్.. ఫ్రెషర్స్ కు టీసీఎస్ అట్లాస్ ఉద్యోగ అవకాశం..