Sri Lanka Crisis: శ్రీలంక ఆర్థిక సంక్షోభం..తెలుగు రాష్ట్రాల నుంచి బియ్యం సరఫరా
Sri Lanka Crisis: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక అల్లాడిపోతోంది. శ్రీలంకను ఆదుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి బియ్యం తరలి వెళ్లనుంది. శ్రీలంక దేశ అభ్యర్థన మేరకు..
Sri Lanka Crisis: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక అల్లాడిపోతోంది. శ్రీలంకను ఆదుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి బియ్యం తరలి వెళ్లనుంది. శ్రీలంక దేశ అభ్యర్థన మేరకు అవసరమైన సాయం చేసేందుకు ముందుకు వచ్చిన ఇండియా.. తక్షణ సాయం కింద బియ్యం పంపాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు రెండే దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో కాకినాడ, విశాఖ, చెన్నై, ట్యూటికోరిన్ తదితర పోర్టుల నుంచి శ్రీలంకకు బియ్యం ఎగుమతి చేయనున్నారు.
మొదటగా కాకినాడ పోర్టు నుంచి..
కాగా, మొదటగా కాకినాడ పోర్టు నుంచి బుధవారం 2వేల మెట్రిక్ టన్నులతో కార్గో బయలుదేరనుంది. తర్వాత చెన్నై, విశాఖపట్నం పోర్టుల నుంచి పంపించనున్నారు. ఇక తెలంగాణలో కొనుగోలు చేసే బియ్యాన్ని చెన్నై పోర్టు ద్వారా తరలించనున్నారు. మొత్తం మూడు లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని దశలవారీగా శ్రీలంకకు పంపుతామని భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం తెలిపింది.
ఇవి కూడా చదవండి: