AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad Drugs Case: హైదరాబాద్ పుడింగ్ అండ్ మింక్ డ్రగ్స్ కేసులో సంచలనాలు. అతడి కనుసన్నల్లోనే డ్రగ్స్‌ సఫ్లై..!

హైదరాబాద్ పుడింగ్ అండ్ మింక్ పబ్ ఇప్పుడిదే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. కారణం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఎందరో సెలబ్రిటీల పిల్లలు ఈ వ్యవహారంలో ఉన్నారు. దీంతో ఈ పబ్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఉత్కంఠగా మారాయి.

Hyderabad Drugs Case: హైదరాబాద్ పుడింగ్ అండ్ మింక్ డ్రగ్స్ కేసులో సంచలనాలు. అతడి కనుసన్నల్లోనే డ్రగ్స్‌ సఫ్లై..!
Hyderabad Drugs
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 05, 2022 | 1:10 PM

Hyderabad Drugs Case: హైదరాబాద్ పుడింగ్ అండ్ మింక్ పబ్(Pudding and Mink Pub) ఇప్పుడిదే రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. కారణం ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఎందరో సెలబ్రిటీల పిల్లలు ఈ వ్యవహారంలో ఉన్నారు. దీంతో ఈ పబ్ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఉత్కంఠగా మారాయి. అసలు ఈ వ్యవహారానికి కర్త, కర్మ, క్రియ.. అభిషేక్‌ ఉప్పాల(Abhishek Vuppala).. పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ ఓనర్‌. ఈయన కనుసన్నుల్లోనే డ్రగ్స్‌ వ్యవహరం నడిచిందా? పబ్‌లోకి డ్రగ్స్‌ ఎంట్రీతో పాటు ఏఏ కస్టమర్‌కు సప్లయ్‌ చేయాలనేది ఈయన నిర్ణయిస్తారా? మేనేజర్‌ అనిల్‌ పాత్రధారి.. ఈయన సూత్రధారా? అంటే అవుననే అంటున్నారు పోలీసులు. ఫుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌ కేసులో తవ్వేకొద్ది సంచలనాలు బయటపడుతున్నాయి. పబ్‌లోకి డ్రగ్స్‌ ఎంట్రీ, సప్లై అంతా అభిషేక్ చేతుల మీదుగానే జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో సెలబ్రిటీలకు, బ్యూరోక్రాట్లకు అభిషేక్‌ ఈవెంట్స్‌ అరేంజ్‌ చేసినట్టు తెలుస్తోంది.

అభిషేక్‌ సెల్‌ఫోన్‌లో చాలామంది సెలబ్రిటీల ఫోన్ నంబర్లు, ఫోటోలు ఉన్నాయి. అభిషేక్ డీలింగ్స్, నెట్‌వర్క్ ఎంత పెద్దదో చెప్పడానికి.. అతని సెల్‌ఫోన్‌లోని ఫోటోలు చూస్తేనే అర్ధమవుతుంది. అభిషేక్‌ సెలబ్రెటీ నెట్‌వర్క్‌ చూసి పోలీసులే షాక్‌కు గురవుతున్నారు. ఫుడ్డింగ్ అండ్ మింక్‌ పబ్‌లోకి మైనర్లను కూడా అనుమతించినట్లు పోలీసులు గుర్తించారు. నిబంధనల ప్రకారం 21 ఏళ్ల వయసు ఉన్నవారినే పబ్‌కి అనుమతించాల్సి ఉండగా.. అంతకన్నా తక్కువ వయసు వారిని కూడా అనుమతించినట్లు తేల్చారు.

మరోవైపు, ఫుడింగ్ అండ్ మింక్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్‌లో నలుగురి పేర్లు చేర్చారు. ఇందులో A1గా అనిల్, A2గా అభిషేక్, A3గా అర్జున్, A4గా కిరణ్ రాజ్‌లను పేర్కొన్నారు. ప్రస్తుతం అనిల్, అభిషేక్ చంచల్ గూడ జైల్లో రిమాండులో ఉండగా అర్జున్, కిరణ్ పరారీలో ఉన్నారు. ఈ పబ్‌కి కిరణ్ రాజ్ లీగలైజర్‌గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో తన భార్యతో కలిసి ఈ పబ్‌ను నిర్వహించిన కిరణ్ రాజ్.. ఆ తర్వాత అభిషేక్, అనిల్‌లకు లీజుకు ఇచ్చినట్లు చెబుతున్నారు.

ఇదిలావుంటే, పుడింగ్ అండ్ మింక్ లైసెన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. డ్రగ్ ఫ్రీ తెలంగాణగా రాష్ట్రాన్ని తీర్చి దిద్దాలన్న లక్ష్యంతో ఉన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గంజాయి, డ్రగ్స్ వినియోగం అమ్మకాలపై ఉక్కు పాదం మోపాలని రాష్ట్రంలో ఉన్న పబ్ యజమానులతో గతంలోనే తాము సమావేశం నిర్వహించామని ఆదిశగా పబ్ ఓనర్లే బాధ్యతగా వ్యవహరించాలని గుర్తు చేశారాయన. ఒక వేళ పబ్ యజమానులు నిర్లక్ష్యం వహిస్తే.. వారి వారి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. నిబంధనలు పాటించని వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా అధికారులు అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. తమ హెచ్చరిక కేవలం రాడిసన్ బ్లూ ప్లాజా పబ్ కి మాత్రమే పరిమితం కాదు. నిబంధనలు పాటించని అన్ని పబ్బులు బార్లపై నిరంతర దాడులు చేస్తున్నట్టు చెప్పారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. డ్రగ్స్ రాకెట్ మూలాలతో సహా పెకళిస్తామని. డ్రగ్స్ తో ఏమాత్రం సంబంధం ఉన్నా వదలక వెంటాడుతామని అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.