Hyderabad: కూకట్‌పల్లిలో దారుణం.. వాటర్ ట్యాంక్ గోడ కూలి చిన్నారి దుర్మరణం..
Hyderabad: కూకట్‌పల్లిలో ఓ బిల్డర్ నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాలను చిదిమేసింది. ఇంటిపై కొత్తగా నిర్మిస్తున్న ట్యాంక్ గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి చనిపోయింది. వివరాలిలా ఉన్నాయి.
Hyderabad: కూకట్‌పల్లిలో ఓ బిల్డర్ నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాలను చిదిమేసింది. ఇంటిపై కొత్తగా నిర్మిస్తున్న ట్యాంక్ గోడ కూలి నాలుగేళ్ల చిన్నారి చనిపోయింది. వివరాలిలా ఉన్నాయి.. గుంటూరుకు చెందిన సునీల్ HMT హిల్స్ శాతవాహన నగర్‌లో ఇటీవలే ఓ బేకరీని ప్రారంభించాడు. ఆ వ్యాపారం మంచిగా సాగుతుండడంతో.. తన భార్య మేరీ, నాలుగేళ్ల కూతురు షారొన్ దీత్యలను కూడా గత నెల ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇల్లు అద్దెకు తీసుకుని భార్యాపిల్లలతో ఉంటున్నాడు. అయితే ఎప్పటిలాగే ఉదయం బేకరి తెరిచిన సునీల్ కు, టిఫిన్ బాక్స్ అందించేందుకు మేరీ తన కూతురితో కలిసి బయలుదేరింది. బేకరి దగ్గరకు రాగానే, పక్కనే ఓ భవనం పై నిర్మిస్తున్న వాటర్ ట్యాంక్ గోడ కూలి చిన్నారి దీత్య పై పడింది. మూడో అంతస్థుపై నుంచి ఒక్కసారిగా ఇటుకలు మీదపడడంతో తలకు తీవ్రగాయాలై దీత్య అక్కడికక్కడే చనిపోయింది. రోడ్డు పై వెళ్తున్న మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
కాగా కళ్ల ఎదుటే బిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించి విచారణ ప్రారంభించారు. ఈక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బిల్డర్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సరైన రక్షణ చర్యలు చేపట్టకుండా నిర్మాణాలు చేపట్టడంతో అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నారు.
Also Read:OnePlus 10 Pro: మార్కెట్లోకి వన్‌ప్లస్ కొత్త ఫోన్ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఔరా అనాల్సిందే.. పూల చీరలో ఫోటోలకు ఫోజులిచ్చిన పుత్తడి బొమ్మ..