AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తరచూ ఫోన్‌ మాట్లాడుతుందని భార్యపై అనుమానం.. హత మార్చేందుకు మిత్రుడికి సుపారీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Hyderabad: నగరంలోని సనత్ నగర్ పీఎస్ పరిధిలో 4 రోజుల క్రితం ఓ అగంతకుడు మహిళ గొంతుకోసిన సంగతి తెలిసిందే. భరత్ నగర్‌లో మహేశ్వరి నగర్ లో నివసించే స్పందన (26) అర్ధరాత్రి 1-2 గంటల మధ్య తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో..

Hyderabad: తరచూ ఫోన్‌ మాట్లాడుతుందని భార్యపై అనుమానం.. హత మార్చేందుకు మిత్రుడికి సుపారీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Basha Shek
|

Updated on: Apr 05, 2022 | 11:37 AM

Share

Hyderabad: నగరంలోని సనత్ నగర్ పీఎస్ పరిధిలో 4 రోజుల క్రితం ఓ అగంతకుడు మహిళ గొంతుకోసిన సంగతి తెలిసిందే. భరత్ నగర్‌లో మహేశ్వరి నగర్ లో నివసించే స్పందన (26) అర్ధరాత్రి 1-2 గంటల మధ్య తన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి వచ్చి గొంతు కోసి పారిపోయాడని సనత్ నగర్ పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు ఈ ఘటనలో భర్తే సూత్రధారి అని తేల్చారు. స్పందనపై హత్యాయత్నం జరిగిన సమయంలో భర్త వేణు ఏడాది పాపతో ఇంటి బయటే ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు అతని కాల్ డేటా, సీసీ పుటేజీని పరిశీలించి నిజాలు నిగ్గు తేల్చారు. భార్యపై అనుమానం రావడంతో ఆమెను అంతమొందించాలని భావించిన వేణు ఇందుకోసం తన స్నేహితుడు జూనియర్‌ ఆర్టిస్‌ తిరుపతికి రూ. 7లక్షల సుపారీ ఇచ్చాడు. ప్రణాళికలో భాగంగానే భార్యపై హత్యాయత్నం జరిగిన సమయంలో తన కుమార్తెను తీసుకుని బయటకు వెళ్లాడు. కాగా గొంతు కోసిన తర్వాత సమయానికి బాధితురాలిని ఆస్పత్రికి తరలించడం, చికిత్స అందించడంతో కోలుకుంది.

కాగా స్పందన తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటంతో.. వేణుగోపాల్‌ ఆమెపై అనుమానం పెంచుకున్నట్ల పోలీసులు తెలిపారు. అందుకే ఆమెను హత్య చేయాలని ప్లాన్ వేశాడు. ఇందులో భాగంగానే యూసుఫ్‌గూడలో ఉండే స్నేహితుడు జూనియర్‌ ఆర్టిస్టు తిరుపతికి సుపారీ ఇచ్చాడు. కాగా గతేడాది డిసెంబరులో స్పందన మెదక్‌ జిల్లా చేగుంటలోని పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఉన్నప్పుడు కూడా తిరుపతి ఆమెపై కత్తితో హతమార్చేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె కేకలు వేయడంతో పారిపోయినట్లు తిరుపతి విచారణలో తెలిపాడు. కాగా తిరుపతి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వేణుగోపాల్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. Also Read: Covid Variant XE: ఇప్పట్లో మనల్ని కరోనా వదిలేలా లేదు.. కొత్త కొత్త రూపాలతో ప్రాణాలు తోడేస్తోంది!

ESIC Recruitment 2022: ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌లో స్పెషలిస్టు గ్రేడ్‌ – 2 ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు..

Graduate Engineer Trainee Jobs: బీఈ/బీటెక్‌ నిరుద్యోగులకు బంపరాఫర్! లక్షన్నర జీతంతో దామోదర్‌ వాలీ కార్పొరేషన్‌లో జాబ్స్‌..