Kashmir Files: కాశ్మీర్ లోయలో మళ్ళీ పేట్రేగిపోతున్న ఉగ్రవాదులు.. పండిట్‌పై కాల్పులు

Jammu and Kashmir: కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మళ్ళీపేట్రేగిపోతున్నారు. 24 గంటల వ్యవధిలో వరుసగా 4 చోట్ల దాడులకు పాల్పడ్డారు. తాజా ఘటనలో ఉగ్రవాదులు ఓ కశ్మీరీ పండిట్

Kashmir Files: కాశ్మీర్ లోయలో మళ్ళీ పేట్రేగిపోతున్న ఉగ్రవాదులు.. పండిట్‌పై కాల్పులు
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 05, 2022 | 10:01 AM

Jammu and Kashmir: కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మళ్ళీపేట్రేగిపోతున్నారు. 24 గంటల వ్యవధిలో వరుసగా 4 చోట్ల దాడులకు పాల్పడ్డారు. తాజా ఘటనలో ఉగ్రవాదులు ఓ కశ్మీరీ పండిట్ పై కాల్పులు జరపగా, అంతకుముందు సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానికేతర కూలీలు, సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. షోపియాన్‌ జిల్లాలో సోమవారం ఒక కాశ్మీర్‌ పండిట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆ వ్యక్తిని ఆర్మీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఛోటోగామ్‌ ప్రాంతంలో ఒక షాపు నిర్వహించే సోను కుమార్ బల్జీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన పండిట్‌ను శ్రీనగర్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందుతుందని పోలీసులు తెలిపారు.

గత 24 గంటల్లో ఉగ్రవాదులు నాలుగుచోట్ల ఏడుగురిపై కాల్పులు జరిపారు. కాల్పులకు గురైన వారిలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లతోపాటు నలుగురు స్థానికేతరులు ఉన్నారు. పుల్వామా జిల్లాలో కోళ్ల ఫారంలో పని చేసే పంజాబ్‌కు చెందిన ఇద్దరు కార్మికులపై ఉగ్రవాదులు ఆదివారం కాల్పులు జరిపారని పోలీసులు తెలిపారు. సోమవారం శ్రీనగర్‌లోని మైసుమా ప్రాంతంలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఒక జవాన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా.. మరో జవాన్‌ చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.

ఇదిలాఉంటే.. సీఆర్పీఎఫ్‌ జవాన్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని జమ్ముకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు ఎన్సీపీ నేత ఒమర్‌ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ ఖండించారు. కాగా.. మళ్లీ ఉగ్రవాదుల కదలికలు పెరిగిపోవడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.

Also Read:

Owaisi on Navratri: దక్షిణ ఢిల్లీలో నేటి నుండి మాంసం దుకాణాలు బంద్.. ఘాటుగా స్పందించిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

Newly Married: కాళ్ల పారాణి ఆరక ముందే.. వాళ్ల పాలిట యమ పాశంగా మారిన పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్