Indian Army NCC Recruitment 2022: ఎన్సీసీ మహిళ, పురుష అభ్యర్ధులకు ఇండియన్ ఆర్మీ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..
భారత రక్షణ శాఖకు చెందిన ఇండియన్ ఆర్మీ (Indian Army).. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC Officer Posts) ఆఫీసర్లుగా చేరేందుకు అర్హులైన ఎన్సీసీ అభ్యర్ధుల (అవివాహిత పురుషులు, మహిళలు) నుంచి..
Indian Army NCC Special Entry Recruitment 2022: భారత రక్షణ శాఖకు చెందిన ఇండియన్ ఆర్మీ (Indian Army).. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC Officer Posts) ఆఫీసర్లుగా చేరేందుకు అర్హులైన ఎన్సీసీ అభ్యర్ధుల (అవివాహిత పురుషులు, మహిళలు) నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు గాను ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీం 52వ కోర్సు(అక్టోబరు 2022) నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 55
- పురుషులు: 50 (జనరల్ కేటగిరీ:45, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి: 05)
- మహిళలు: 5 (జనరల్ కేటగిరీ: 4, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి:1)
పోస్టుల వివరాలు: షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్ఎస్సీ) ఆఫీసర్ పోస్టులు
వయోపరిమితి: జూన్ 1, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.75,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అర్హతలు: కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్సీసీ ‘సీ’ సర్టిఫికెట్ తప్పనిసరిగాఉండాలి. యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి ఎన్సీసీ ’సీ’ సర్టిఫికెట్ అవసరం లేదు.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఫేజ్-1లో ఎంపిక అయిన అభ్యర్ధులకు ఫేజ్-2 ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 13, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Also Read: