AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Newly Married: కాళ్ల పారాణి ఆరక ముందే.. వాళ్ల పాలిట యమ పాశంగా మారిన పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్

జీవిత భాగస్వామితో వేసే ప్రతి అడుగూ ప్రత్యేకంగా ఉండాలని జంటలు కోరుకుంటారు. జీవితాంతం గుర్తుండిపోయేలా పెళ్లి అనుభూతులు ఉండాలని.. కొన్ని జంటలు ప్రయత్నిస్తుంటాయి. కానీ అది ఒక్కోసారి విషాదం నింపుతుంది.

Newly Married: కాళ్ల పారాణి ఆరక ముందే.. వాళ్ల పాలిట యమ పాశంగా మారిన పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్
Kerala Couple
Balaraju Goud
|

Updated on: Apr 05, 2022 | 7:33 AM

Share

Post-wedding shoot Tragedy: పెళ్లంటే నూరేళ్ల పంట.. జీవితంలో ఒక్కసారే జరిగే వైభవం. జీవిత భాగస్వామితో వేసే ప్రతి అడుగూ ప్రత్యేకంగా ఉండాలని జంటలు కోరుకుంటారు. జీవితాంతం గుర్తుండిపోయేలా పెళ్లి అనుభూతులు ఉండాలని.. కొన్ని జంటలు ప్రయత్నిస్తుంటాయి. కానీ అది ఒక్కోసారి విషాదం నింపుతుంది. ఇదిగో ఈ జంటను చూడండి. చూడముచ్చటైన జంట. కేరళ రాష్ట్రం, కోజికోడ్‌ ప్రాంతానికి చెందిన వీళ్ల పేర్లు రజిన్, కనిహా. ఈ ఏడాది మార్చి 14న అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగింది. పెళ్లి తాలూకూ మధురానుభూతులు ఇంకా చెరిగిపోలేదు. ఇంటికి కట్టిన తోరణాలు పూర్తిగా ఎండనూ లేదు. ఆ ఇంటి నుంచి పెళ్లి కల అలా ఉండగానే.. తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్ .. వాళ్ల పాలిట యమ పాశంగా మారింది.

నవ వధూవరులు ఇద్దరూ జాంకిక్కడ్ ప్రాంతంలోని కుట్యాడి నది సమీపంలో వెడ్డింగ్ షూట్ కోసం వెళ్లారు. కానీ నదిలో ఫొటోలు దిగుతుండగా.. ఇద్దరూ పడిపోయారు. వారి కేకలు విన్న స్థానికులు నదిలోకి దూకి ఇద్దిరినీ బయటికి తీసి ఆస్పత్రికి తరలించారు. కానీ వరుడు ప్రాణాలు కోల్పోయాడు. వధువు మాత్రం ప్రాణాలతో బయటపడింది.అప్పటి దాకా సందడిగా ఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోయింది. ఫోటోషూట్ జరిగిన ఈ కుట్యాడి నది ప్రాంతంలో గతంలోనూ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. రెయిలింగ్ లేకపోవడం.. నీటి ప్రవాహం అకస్మాత్తుగా పెరగడంతో ప్రమాదాలు జరుగుతున్నట్టు చెప్తున్నారు స్థానికులు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం, ఇతర నిశ్చితార్థాల కారణంగా ఈ జంట ఔట్‌డోర్ వెడ్డింగ్ షూట్‌ను ఏప్రిల్ 4కి వాయిదా వేసింది. సోమవారం ఉదయం 7 గంటలకు షూటింగ్‌ ప్రారంభమైంది.

మృతుడు పేరంబ్రా సమీపంలోని కడియంగడ్‌కు చెందిన రెజిల్‌గా గుర్తించామని పోలీసులు తెలిపారు. పెరువణ్ణాముజి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రాంతంలోని కుట్టియాడి నది నీటి అడుగున లోతైన గుంతల గురించి తెలియని చాలా మంది పర్యాటకులకు గతంలో మరణ ఉచ్చుగా మారింది. ఈత రాని రెజిల్ ఆ గుంతలో చిక్కుకుని మృతి చెందినట్లు తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.

Read Also….  Hyderabad: ఫోన్ మాట్లాడుతుందని అనుమానం.. భార్యను చంపేందుకు సుపారీ.. చివరకు ఏమైందంటే?