AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fisherman Missing: ఇంకా లభ్యం కాని మత్స్యకారుల ఆచూకీ.. కుటుంబసభ్యుల్లో ఆందోళన..

Kakinada Port: కాకినాడ జిల్లా సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఫోన్లు స్విచ్చాఫ్ కావడంతో

Fisherman Missing: ఇంకా లభ్యం కాని మత్స్యకారుల ఆచూకీ.. కుటుంబసభ్యుల్లో ఆందోళన..
Fisherman
Shaik Madar Saheb
|

Updated on: Apr 05, 2022 | 9:17 AM

Share

Kakinada Port: కాకినాడ జిల్లా సముద్ర తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ ఇంకా లభించలేదు. దీంతో వారి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఫోన్లు స్విచ్చాఫ్ కావడంతో ఇప్పటిదాకా ఆచూకీ లభ్యం కాలేదంటూ అధికారులు తెలిపారు. కాకినాడ పర్లోపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారులు మార్చి 30న సముద్రంలో వేటకు వెళ్లారు. ఈ క్రమంలో సముద్రంలోకి వెళ్లిన తర్వాత బోటు ఇంజన్‌లో సమస్యఏర్పడిందని.. దీంతో ఆగిపోయిందంటూ మూడు రోజుల క్రితం మత్స్యకారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చివరిగా భీమునిపట్నం వైపు బోటు కొట్టుకుపోతుందంటూ మత్స్యకారులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారి వద్దనున్న సమాచార వ్యవస్థ కూడా నిలిచిపోవడంతో సెల్ ఫోన్స్ కూడా పనిచేయడంలేదు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

వారి ఆచూకీని గుర్తించేందుకు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు ఇప్పటికే కాకినాడ జిల్లా కొత్త కలెక్టర్ కృతిక శుక్లాను ఆశ్రయించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారుల ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. కోస్ట్ గార్డ్ సహాయంతో మత్స్యకార అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

Also Read:

Summer Tips: వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగడం మంచిదేనా.? ఈ విషయాలు తెలుసుకోండి!

Visakhapatnam: మాయమాటలతో నమ్మించాడు.. పెళ్లిచేసుకుంటానంటూ మోసం చేశాడు.. సీన్‌ కట్ చేస్తే పదేళ్ల జైలు శిక్ష..