MP Gurumurthy: ప్రత్యేక హోదా కోసం వెనక్కు తగ్గేది లే.. సీఎం జగన్ ఏది చెప్పినా చేయడానికి సిద్ధంః ఎంపీ గురుమూర్తి
ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ ఇతర రాష్ట్రాలను సైతం ఆకర్షిస్తోంది. సంక్షేమ పథకాల అమలును ప్రజలు అనుభవిస్తున్నారు. కాబట్టే ప్రతిపక్షాల ఆరోపణలను పట్టించుకోవడం లేదని వైసీపీ ఎంపీ గురుమూర్తి అన్నారు.
Tirupati MP Gurumurthy: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో అమలు చేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ ఇతర రాష్ట్రాలను సైతం ఆకర్షిస్తోంది. సంక్షేమ పథకాల అమలును ప్రజలు అనుభవిస్తున్నారు. కాబట్టే ప్రతిపక్షాల ఆరోపణలను పట్టించుకోవడం లేదని వైసీపీ ఎంపీ గురుమూర్తి(Gurumurthy) అన్నారు. టీవీ 9కి ఇచ్చిన ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ సంకల్పిస్తే వెనకడుగు వేయరు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఆపే పరిస్థితి ఎప్పటికీ రాదని స్పష్టం చేశారు. ప్రజల నాడీ తెలిసిన నాయకుడు సీఎం జగన్ అన్న ఆయన.. అన్ని వర్గాలకు మంచి చేస్తున్నారని ప్రతిపక్షాలకీ తెలుసు.. రాజకీయం కోసం తప్పదు కాబట్టే మాపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో మెరుగైన పాలన అందించేందుకు జగన్ సర్కార్ కట్టుబడి ఉందన్న గురుమూర్తి.. పాలనా వికేంద్రీకరణతో సాధ్యమన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేంత వరకు జగన్ పోరాడుతూనే ఉంటారన్నారు. ప్రధానిని కలిసినప్పుడల్లా సీఎం జగన్ ప్రత్యేక హోదా ప్రస్తావన తెస్తున్నారు. ప్రత్యేక హోదాపై పార్లమెంటులో వైసీపీ ఒత్తిడి తెస్తూనే ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా కోసం మా నాయకుడు జగన్ ఏది చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని గురుమూర్తి స్పష్టం చేశారు.
అయితే, పార్టీ అంతర్గ విభేదాలపై స్పందించిన ఆయన.. నాకు ఎలాంటి పదవులపై ఆశలేదన్నారు. సీఎం ఏ బాధ్యత అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నానన్న ఆయన.. సీనియర్ నేతలతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. పార్టీ అధినేతగా జగన్ ఆదేశిస్తే.. ఇంటి దగ్గర కూర్చోమంటే కూర్చుంటానన్నారు. కరోనాతో సహ జీవనం చేయాలని సీఎం జగన్ ముందే చెబితే విమర్శించారు. ఇప్పుడందరూ కరోనాతో సహ జీవనం చేస్తున్నారని గురుమూర్తి గుర్తు చేశారు.
Read Also… Viral Video: చూసుకోవాలి కదమ్మా..! ముక్కు పగిలింది.. అద్దం బద్దలైంది.. ఫన్నీ వీడియో