Summer Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తిరుపతి – మచిలీపట్నం మధ్య 98 ప్రత్యేక రైళ్లు
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(SCR) శుభవార్త చెప్పింది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని 98 ప్రత్యేక రైళ్లు(Special Trains) నడిపేందుకు నిర్ణయించింది. ఇవి మచిలీపట్నం - తిరుపతి, తిరుపతి - మచిలీపట్నం మధ్య సేవలందిస్తాయని...
రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే(SCR) శుభవార్త చెప్పింది. వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని 98 ప్రత్యేక రైళ్లు(Special Trains) నడిపేందుకు నిర్ణయించింది. ఇవి మచిలీపట్నం – తిరుపతి, తిరుపతి – మచిలీపట్నం మధ్య సేవలందిస్తాయని ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. ప్రయాణికులు ఆన్‌లైన్(Online) ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.
మచిలీపట్నం – తిరుపతి మధ్య..
07095 నంబర్ గల ప్రత్యేక రైలు ఏప్రిల్ 6, 8, 10, 13, 15, 17, 18, 20, 22, 24, 25, 27, 29, మే నెలలో 1, 2, 4, 6, 8, 9, 11, 13, 15, 16, 18, 20, 22, 23, 25, 27, 29, 30, మే నెలలో 1, 3, 5, 6, 8, 10, 12, 13, 15, 17, 19, 20, 22, 24, 26, 27, 29 తేదీల్లో మచిలీపట్నం నుంచి సాయంత్రం 5.40 నిమిషాలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 4.00 గంటలకు తిరుపతి చేరుకుంటుందని వెల్లడించింది. ఈ రైలు గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
తిరుపతి – మచిలీపట్నం మధ్య..
ఏప్రిల్ 7, 9,11, 12, 14, 16, 18, 19, 21, 23, 25, 26, 28, 30, మే నెలలో 2, 3, 5, 7, 9, 10, 12, 14, 16, 17, 19, 21, 23, 24, 26, 28, 30, 31, జూన్ లో 2, 4, 6, 9, 11, 13, 14, 16, 18, 20, 21, 23, 25, 27, 28, 30 తేదీల్లో తిరుపతిలో రాత్రి 9.00 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 07.45 నిమిషాలకు మచిలీపట్నం చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ స్టేషన్లలో ఆగుతుంది.
Also Read
Governor Tamilisai: ఢిల్లీకి గవర్నర్తమిళిసై.. మంగళవారం అమిత్ షాతో భేటీ.. ఆ అంశంపైనే కీలక చర్చ..
TS Ed.CET: విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణ ఎడ్ సెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..
Health Tips: ఆ డైట్ ఫాలో అవుతున్నారా.? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే.. ఇవి తెలుసుకోండి!