Health Tips: ఆ డైట్ ఫాలో అవుతున్నారా.? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే.. ఇవి తెలుసుకోండి!
ఈ డైట్‌పై ప్రస్తుతం ఆరోగ్య నిపుణుల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. యో-యో డైట్‌కు సంబంధించి ఆరోగ్య ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే..
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేందుకు ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలందరూ కూడా యో-యో డైట్ ఫాలో అవుతున్నారు. అయితే ఈ డైట్‌పై ప్రస్తుతం ఆరోగ్య నిపుణుల్లో విపరీతంగా చర్చ జరుగుతోంది. యో-యో డైట్‌కు సంబంధించి ఆరోగ్య ప్రయోజనాల కంటే దుష్ప్రభావాలే ఎక్కువ ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ డైట్‌కు సంబంధించిన దుష్ప్రభావాలు గురించి కీలక విషయాలు వెల్లడించారు. యో-యో డైట్ చేయడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదముందని అమెరికన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ రకమైన డైట్‌ను అనుసరించే వ్యక్తులలోని రక్తంలో చక్కెర స్థాయిలు క్షీణిస్తున్నాయని వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్ యూనివర్శిటీ పరిశోధకులు తాజా పరిశోధనలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
అసలు యో-యో డైట్ అంటే ఏమిటి?
హెల్త్‌లైన్ నివేదిక ప్రకారం, యో-యో డైటింగ్‌ను వెయిట్ సైక్లింగ్ అని కూడా అంటారు. ఈ రకమైన డైటింగ్‌లో, ఒక ప్రత్యేక పద్ధతిని అనుసరిస్తారు. దీని పేరుకు తగ్గట్టుగానే.. ఈ డైట్‌ను అనుసరిస్తున్న వ్యక్తి.. మొదటిగా బరువు తగ్గితే.. ఆ తర్వాత మళ్లీ పెరిగి.. మళ్లీ తగ్గుతారు. ఈ క్రమం పద్దతి ప్రకారమే డైటింగ్ ప్లాన్ కూడా సిద్దమవుతుంది. ఇక ఈ తరహా డైటింగ్ వల్ల శరీరంపై చెడు ప్రభావం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రమాదాలు ఏంటి.? ఏం జరుగుతుంది.?
యో-యో డైట్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకునేందుకు ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించామని పరిశోధకులు చెబుతున్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగంలో పదేపదే బరువు పెరగడం, తగ్గడం.. ప్రత్యక్షంగా గుండె, కిడ్నీలపై ప్రభావం చూపిస్తున్నట్లు వెల్లడైంది. తద్వారా వాటి సామర్ధ్యం కూడా తగ్గుతున్నట్లు గ్రహించారు. అలాగే ఈ డైట్ ఫాలో అవుతున్న వారి శరీరంలోని కణాలు రక్తం నుంచి చక్కెరను సరిగ్గా గ్రహించలేవు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇక ఈ డైట్ ఆపేసిన తర్వాత జంతువులు కోలుకోగా.. వాటి గుండె, జీవక్రియ ఆరోగ్యం మాత్రం బాగుపడలేదని డాక్టర్ ఎలిన్ డిసౌజా అన్నారు. ఇదే విషయం మీరు మనుషుల్లోనూ చూడవచ్చునని ఆయన తెలిపారు.
Medical Express నివేదిక ప్రకారం, పరిశోధకులు 16 ఆడ ఎలుకలపై తమ పరిశోధనలు చేశారు. వాటిని రెండు గ్రూపులుగా విడదీసి.. మొదటి సమూహానికి యోయో డైట్ ఇస్తే.. మరో గ్రూపుకు ఎలాంటి డైట్ ఇవ్వలేదు. ఆ తర్వాత రెండు గ్రూపుల నుంచి ఎలుకల అల్ట్రాసౌండ్ స్కాన్లు సేకరించారు. గుండె, కిడ్నీల పనితీరుని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం యోయో డైట్ అనుసరించిన ఎలుకలకు గుండె జబ్బులు, మధుమేహం వంటి రోగాలు వచ్చే ప్రమాదముందని వ్యక్తమైంది. ఈ డైట్ అనేక విధాలుగా శరీరంపై చెడు ప్రభావాలను చూపుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
గమనిక: ఈ వార్తలో అందించిన సమాచారం అధ్యయనాలు, నిపుణులు పేర్కొన్న వివరాలు మాత్రమే. కేవలం అవగాహన కోసమే. ఏదైనా డైట్ తీసుకునే విషయంలో మీరు కచ్చితంగా వైద్యులు సలహా పాటించాలి.