AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: తలపై దురద భరించలేకపోతున్నారా.. ఈ చిట్కాలతో సింపుల్‌గా వదిలించుకోండి..!

Health Tips: చాలా మందికి తలపై దురద సమస్య ఉంటుంది. దీనికి కారణం జుట్టులో ఉండే మురికి, చెమట, చుండ్రు కావొచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా దురద సమస్య వస్తుంది.

Health Tips: తలపై దురద భరించలేకపోతున్నారా.. ఈ చిట్కాలతో సింపుల్‌గా వదిలించుకోండి..!
Itching On Head
uppula Raju
|

Updated on: Apr 04, 2022 | 5:50 PM

Share

Health Tips: చాలా మందికి తలపై దురద సమస్య ఉంటుంది. దీనికి కారణం జుట్టులో ఉండే మురికి, చెమట, చుండ్రు కావొచ్చు. ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా దురద సమస్య వస్తుంది. చాలా మంది చుండ్రు నుంచి ఉపశమనం పొందడానికి అనేక రకాల సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఇవి దీర్ఘకాలంలో జుట్టుకు హాని కలిగిస్తాయి. ఈ పరిస్థితిలో తలపై నూనె రాయడం, బాగా మసాజ్ చేయడం చేయాలి. ఇది కాకుండా కొన్ని హోం రెమిడిస్ కూడా ప్రయత్నించవచ్చు. ఇవి తలపై నుంచి చుండ్రు సమస్యని తొలగిస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.

వేప, కొబ్బరి నూనె

ఇందుకోసం 15 నుంచి 20 వేప ఆకులు తీసుకోండి. వాటిని మెతగా రుబ్బుకోండి. ఈ పేస్ట్‌కి 2 చెంచాల కొబ్బరి నూనె కలపండి. మెల్లగా దీనిని తలకు పట్టించండి. చేతి వేళ్లతో మసాజ్ చేయండి. 20 నుంచి 25 నిమిషాల పాటు ఉంచుకోండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూ ఉపయోగించి జుట్టును కడగండి. దురద నుంచి ఉపశమనం పొందడానికి ఈ మిశ్రమం మీకు సహాయం చేస్తుంది. మీరు దీన్ని వారానికి 1 నుంచి2 సార్లు ఉపయోగించవచ్చు.

వేపను ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. ఇది యాంటీమైక్రోబయల్, యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది తలపై దురద, చుండ్రును తొలగించడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది దురద, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. కొబ్బరి నూనె తలలో దురదను తగ్గిస్తుంది. ఇది తలలో తేమను సమతుల్యం చేయడంలో తోడ్పడుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్, ఆల్మండ్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్

ఈ హెయిర్ ప్యాక్‌ తయారు చేయడానికి ఒక గిన్నెలో 1 టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకోండి. అలాగే 1 టీస్పూన్ బాదం నూనె వేయండి. దానికి 2-3 చుక్కల టీ ట్రీ ఆయిల్ కలపండి. ఈ మిశ్రమాన్ని తలకి పట్టించి మసాజ్ చేయండి. 15 నిమిషాల పాటు ఉంచుకోండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి. వారానికి 2 సార్లు చేస్తేమంచి ఉపశమనం ఉంటుంది.

యాపిల్ సైడర్ వెనిగర్‌లో ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవి వైరస్‌లు, బ్యాక్టీరియాలతో పోరాడుతాయి. ఇవి తలపై దురదను తొలగించడంలో సహాయపడుతాయి. ఇది చుండ్రు చికాకును తగ్గిస్తుంది. బాదం నూనెలో ప్రోటీన్, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును మెరిసేలా, బలంగా చేస్తుంది. టీ ట్రీ ఆయిల్ తలపై దురదను తగ్గిస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

తక్కువ పెట్టుబడి.. ఎక్కువ రాబడికి మంచి మార్గం..SIPతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్మెంట్

Health Photos: గుండెపోటు నుంచి తప్పించుకోవాలంటే కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..!

Gas Cylinder: వంట గ్యాస్ అయిపోవచ్చిందా.. చివరి నిమిషంలో టెన్షన్ పడకండి.. ముందుగా ఇలా సిలిండర్ బుక్ చేయండి..!