AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Minister Perni Nani: సొంత నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ తెచ్చుకోలేకపోయాడు.. చంద్రబాబుపై సెటైర్లు..

ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో నూతన ఆధ్యాయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారని మంత్రి పేర్ని నాని అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్‌..

Minister Perni Nani: సొంత నియోజకవర్గానికి రెవెన్యూ డివిజన్ తెచ్చుకోలేకపోయాడు.. చంద్రబాబుపై సెటైర్లు..
Minister Perni Nani
Sanjay Kasula
|

Updated on: Apr 04, 2022 | 8:41 PM

Share

ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో నూతన ఆధ్యాయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(CM Jagan) శ్రీకారం చుట్టారని మంత్రి పేర్ని నాని(Minister Perni Nani) అన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్‌ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చారని వివరణ ఇచ్చారు. ఈ మేరకు తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రజల సౌలభ్యం కోసం 13 కొత్త జిల్లాలను ఏర్పాట్లు చేశారని.. ఇది ఆంద్రప్రదేశ్ చరిత్రలో ఒక మైల్ స్టోన్‌గా నిలిచిపోతుందని అన్నారు. కేవలం మూడేళ్ళ అనుభవంలోనే ఇలాంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం గొప్ప సంగతన్నారు. మంచి చేసేప్పుడు మంచి అని చెప్పలేని.. వారు నోటికి తాళం వేసుకోవాలని హితవు పలికారు మంత్రి. వైఎస్‌ జగన్ చెప్పిన ప్రతిమాటలో 95 శాతం హామీలను నెరవేర్చారని మంత్రి తెలిపారు.

చంద్రబాబు హయాంలో పాఠశాలలు మూతవేసే స్థాయి నుంచి ఈ రోజు సీట్లు లేవని బోర్డులు పెట్టె స్థాయికి సీఎం జగన్‌ తీసుకొచ్చారని అన్నారు. నలభై ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే కింగ్ మేకర్ చంద్రబాబు అనుభవం ఏమైందని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. చివరికి ఒక నవ యువకుడి వద్ద కుప్పంను రెవిన్యూ డివిజన్ చేయాలని అభ్యర్థించారని ప్రస్తావించారు.

43 ఏళ్ళుగా పెరిగిన జనాభా పవన్ కి కనిపించలేదా..? ఏటపాక, కుకునూరు ఏ జిల్లాల్లో ఉన్నాయో కూడా పవన్ కి తెలీదా.. చంద్రబాబు హయాంలో పవన్ చాలా బాధ్యతలు తీసుకున్నారు.. అవన్నీ ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పవన్ ఏమయ్యాడు..? తన అభిప్రాయం ప్రభుత్వంకి ఎందుకు చెప్పలేదు.. షూటింగ్ లో ఉండి అవన్నీ పట్టించుకోలేదేమో అంటూ ఎద్దేవ చేశారు.

ఇప్పుడు చంద్రబాబు రాసిచ్చిన నోట్ పై సంతకం పెట్టి విడుదల చేశాడు. 175 నియోజకవర్గాల్లో జనసేన పోటీ చెయ్యాలని జనసైనికులు కోరుకుంటుంటే టీడీపీతో కలవడానికి పవన్ తాపత్రేయ పడుతున్నాడు అంటూ వెల్లడించారు. సీపీఐ నారాయణ, రామకృష్ణ టీడీపీకి గొడుగులా పనిచేస్తున్నారని అన్నారు. 2014 నుండి 2019 మధ్యలో చంద్రబాబుని అఖిలపక్షం వేయమని ఆడిగారా..? రాజధాని, ప్రత్యేకహోదా అంశాలపై నిర్ణయాలు తీసుకున్నప్పుడు అఖిలపక్షం ఆడిగారా..? రామకృష్ణ నోరు ఆనాడు లేవలేదు.. ఈరోజు లేస్తుందని మండిపడ్డారు. గొప్పగా బ్రతికిన ఎర్ర జండాని పసుపు రంగులో కలిపేశారు అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

పేదల కోసం పోరాటం చేసింది కమ్యూనిస్టు పార్టీ ఆనాటిది.. అలాంటి పార్టీని ఇద్దరూ దిగజారుస్తున్నారు. రామకృష్ణ, నారాయణ సీపీఐ చంద్రబాబు పార్టీ అని పెట్టుకోవాలి.. వీళ్ళిద్దరు చేసే పనులతో పార్టీకోసం అశువులుబాసిన వారి ఆత్మ క్షోభిస్తుందన్నారు. పోలవరం, రంపచోడవరం సమస్యని పరిష్కరించడానికి సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారు..

ఇవి కూడా చదవండి: Stock Market: రంకెలేసిన బుల్.. 3 నెలల తర్వాత 30 లక్షల కోట్ల లాభం.. ఫుల్ జోష్‌లో ఇన్వెస్టర్లు ..

Pakistan PM Imran Khan: ఇమ్రాన్ ఓ పిచ్చోడు.. సంచలన వ్యాఖ్యలు చేసిన పాక్ ప్రధాని రెండో భార్య..