AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Visakhapatnam: మాయమాటలతో నమ్మించాడు.. పెళ్లిచేసుకుంటానంటూ మోసం చేశాడు.. సీన్‌ కట్ చేస్తే పదేళ్ల జైలు శిక్ష..

Visakhapatnam: ప్రేమించి మోసగించిన యువకుడికి పదేళ్ల జైలు..!మాయమాటలతో ప్రేమిస్తున్నానని వెంటపడి.. పెళ్లిచేసుకుంటానని లోబర్చుకుని ఆపై యువతిని మోసగించిన అభియోగంపై నిందితుడికి పదేళ్ల శిక్ష విధించింది న్యాయస్థానం.

Visakhapatnam: మాయమాటలతో నమ్మించాడు.. పెళ్లిచేసుకుంటానంటూ మోసం చేశాడు.. సీన్‌ కట్ చేస్తే పదేళ్ల జైలు శిక్ష..
Basha Shek
|

Updated on: Apr 05, 2022 | 9:03 AM

Share

Visakhapatnam: ప్రేమించి మోసగించిన యువకుడికి పదేళ్ల జైలు..!మాయమాటలతో ప్రేమిస్తున్నానని వెంటపడి.. పెళ్లిచేసుకుంటానని లోబర్చుకుని ఆపై యువతిని మోసగించిన అభియోగంపై నిందితుడికి పదేళ్ల శిక్ష విధించింది న్యాయస్థానం. నేరం రుజువుకావడంతో పదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. వెయ్యి జరిమానా విధిస్తూ పదకొండో విశాఖ పట్నం అదనపు జిల్లా న్యాయస్థానం, ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక న్యాయస్థానం తీర్పు చెప్పింది. జరిమానా చెల్లించని పక్షంలో నిందితుడు అదనంగా మరో రెండు నెలలు సాధారణ జైలుశిక్ష అనుభవించాలని న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వివరాల్లోకి వెళితే.. గాజువాక ప్రాంతంలో గుడివాడ అప్పన్న కాలనీకి చెందిన ఇరవై రెండేళ్ల పొట్నూరి గిరీష కుమార్ అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లిచేసుకుంటానని నమ్మించాడు. ఈ నేపథ్యంలో ఆ యువతిని శారీరకంగా లోబర్చుకున్నాడు. ఈ విషయం తెలిసి వీరిద్దరికి వివాహం చేయాలని నిందితుని తల్లిదండ్రులను యువతి తల్లిదండ్రులు కోరారు. అయితే పెళ్లికి నిందితుడు, అతని తల్లిదండ్రులు నిరాకరించడంతోపాటు కులం పేరుతో దూషించినట్లు యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు గిరీష్ కుమార్, అతని తల్లిదండ్రులపైనా కేసు నమోదు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన తరువాత నిందితుడిపై నేరం రుజువుకావడంతో కోర్టు శిక్ష ఖరారు చేసింది. పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. అయితే ఈ విషయంలో యువకుడి తల్లి దండ్రులపై నేరం రుజువుకాకపోవడంతో వారిని విడిచిపెట్టారు.

ఖాజా, విశాఖపట్నం, టీవీ 9

Also Read:Rubber Board Recruitment 2022: డిగ్రీ అర్హతతో రబ్బర్‌ బోర్డులో ఫీల్డ్‌ ఆఫీసర్‌ కొలువులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి!

Dance Video: ఇట్లుండాల.. డాన్స్‌ అంటే.. పరేషాన్‌ అవుతున్న నెటిజనం..!

Darja : దర్శకేంద్రుడి చేతులమీదుగా ‘దర్జా’ పాట.. ఆకట్టుకుంటున్న ఉత్తేజ్ గాత్రం