Darja : దర్శకేంద్రుడి చేతులమీదుగా ‘దర్జా’ పాట.. ఆకట్టుకుంటున్న ఉత్తేజ్ గాత్రం

ఒకప్పుడు కమెడీయన్ గా కడుపుబ్బా నవ్వించిన సునీల్, ఆతర్వాత హీరోగా మారి పలు సినిమాలతో అలరించారు. హీరోగా సునీల్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయారు.

Darja : దర్శకేంద్రుడి చేతులమీదుగా 'దర్జా’ పాట.. ఆకట్టుకుంటున్న ఉత్తేజ్ గాత్రం
Anasuya Bharadwaj, Sunil, D
Follow us

|

Updated on: Apr 05, 2022 | 8:36 AM

ఒకప్పుడు కమెడీయన్ గా కడుపుబ్బా నవ్వించిన సునీల్(Sunil), ఆతర్వాత హీరోగా మారి పలు సినిమాలతో అలరించారు. హీరోగా సునీల్ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేకపోయారు. దాంతో ఇప్పుడు ఆయన విలన్ గా మరి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రవి తేజ నటించిన డిస్కో రాజా.. ఆ తర్వాత వచ్చిన కలర్ ఫోటో సినిమాల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమాలో మంగళం శీను పాత్రతో ప్రేక్షకులను అలరించారు సునీల్. ప్రస్తుతం సునీల్ చేతిలో పలు ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఈ క్రమంలోనే సునీల్ ప్రధాన పాత్రలో ఓ సినిమా రాబోతుంది దర్జా అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అందాల భామ అనసూయ నటిస్తున్నారు. కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ సినిమా ఇది.

సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్రంలోని మొదటి పాటను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తాజాగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘దర్జా’ చిత్రంలోని పాటను విడుదల చేయడం ఆనందంగా ఉంది అన్నారు. పాట చాలా బాగుంది. చాలా రిచ్‌గా చిత్రీకరించారు. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి  కామినేని శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Viral Photo: చక్కనైన కళ్లు.. బూరెబుగ్గలు.. ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు యూత్ ఐకాన్..

Arabic Kuthu: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న ‘అరబిక్ కుతు’ సాంగ్ తెలుగు వెర్షన్.. ఇంతకీ మీరూ విన్నారా ?..

Sarkaru Vaari Paata: మహేష్ బాబు ఫ్యాన్స్‏కు మళ్లి నిరాశేనా !.. సర్కారు వారి పాట వాయిదా ?.. ఇప్పుడిదే హాట్ టాపిక్..

Latest Articles