AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: చక్కనైన కళ్లు.. బూరెబుగ్గలు.. ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు యూత్ ఐకాన్..

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్.. రెండు భాషల్లోనూ మొత్తం కలిపి సుమారు 40కి పైగా సినిమాలు చేసింది. 2010లో ఇండస్ట్రీలోకి...

Viral Photo: చక్కనైన కళ్లు.. బూరెబుగ్గలు.. ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు యూత్ ఐకాన్..
Childhood Pic
Ravi Kiran
|

Updated on: Apr 05, 2022 | 9:06 AM

Share

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్.. రెండు భాషల్లోనూ మొత్తం కలిపి సుమారు 40కి పైగా సినిమాలు చేసింది. 2010లో ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టిన ఆమె.. 12 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులకు ఎదుర్కుంది. సూపర్ హిట్స్ కూడా అందుకుంది. మొదటి సినిమాతోనే ‘ఏ మాయ చేశావే’ అంటూ ఎంతోమంది ఫ్యాన్స్‌‌కు క్రష్ అయిపోయింది. ప్రతీ సినిమాలోనూ విభిన్నతను చూపిస్తూ.. ఎంతోమంది యువ హీరోయిన్లకు ఆదర్శంగా నిలిచింది. ఈ అందాల భామ సినిమాలతో పాటు సోషల్ సర్వీస్‌లోనూ ముందుంది. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది చిన్నారులను ఆదుకుంది. కరోనా సమయంలోనూ చాలామంది పేదలకు అండగా నిలిచింది. యూత్‌కు ఐకాన్‌గా నిలిచిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్‌గా టాలీవుడ్ యువ హీరోతో విడాకులు తీసుకుని.. వరుస సినిమాలతో ప్రస్తుతం బిజీబిజీగా ఉంది. ఎవరో గుర్తుపట్టారా.! ఈపాటికి మీకు అర్ధమై ఉంటుంది. మీరనుకునేదే.. ఆమెవరో కాదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.

మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన సమంత.. 2010లో దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ‘ఏ మాయ చేశావే’ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా అడుగుపెట్టింది. తొలి సినిమాతో సమంత.. ఎంతోమంది అభిమానుల మనసుల్లో స్థానాన్ని సంపాదించింది. ఆ తర్వాత ‘బృందావనం’, ‘దూకుడు’, ‘ఈగ’, ‘ఎటో వెళ్లిపోయిందే మనసు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘అత్తారింటికి దారేది’, ‘మనం’, ‘కత్తి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అఆ’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’, ‘సూపర్ డీలక్స్’, ‘మజిలి’, ‘ఓ బేబీ’ లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించింది.

కాగా, మొదటి సినిమాతోనే నాగచైతన్య, సమంత ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ ఏడేళ్ల పాటు డేటింగ్ చేసి.. చివరికి 2017, అక్టోబర్ 6వ తేదీన పెద్దల సమక్షంలో ఒకటయ్యారు. అయితే అనూహ్యంగా నాలుగేళ్ల అనంతరం అక్టోబర్ 2, 2021న ఇద్దరూ విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం సమంత నటించిన ‘కాథు వాకుల రెండు కాదల్’, ‘శాకుంతలం’ రిలీజ్ రెడీ అవ్వగా.. ‘యశోదా’ మూవీ షూటింగ్ జరుపుకుంటోంది.

ఇవి చదవండి:

Follow Us
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?