Summer Tips: వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగడం మంచిదేనా.? ఈ విషయాలు తెలుసుకోండి!

ఎండలు మండిపోతున్నాయి. భగభగలాడే సూర్యుడి వేడిని తట్టుకోలేక చాలామంది ఈ సీజన్‌లో ఫ్రిడ్జ్ వాటర్‌ను తాగుతుంటారు...

Summer Tips: వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగడం మంచిదేనా.? ఈ విషయాలు తెలుసుకోండి!
Ice Water
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 05, 2022 | 9:08 AM

ఎండలు మండిపోతున్నాయి. భగభగలాడే సూర్యుడి వేడిని తట్టుకోలేక చాలామంది ఈ సీజన్‌లో ఫ్రిడ్జ్ వాటర్‌ను తాగుతుంటారు. అయితే ఈ వాటర్ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. గొంతు ఇన్ఫెక్షన్లు, జీర్ణ సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు సంబంధిత వ్యాధులతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చునని చెబుతున్నారు.

ఫ్రిడ్జ్ వాటర్ ఆ సమయంలో మీ దాహాన్ని తీర్చినా.. అది శరీరంలోని వేడిని ఎక్కువ చేస్తుందని అంటున్నారు. దాహం తీర్చుకోవడానికి కాచి చల్లార్చిన నీటిని తాగమని సలహా ఇస్తున్నారు. అలాగే వేసవిలో వేడి తాపాన్ని తట్టుకునేందుకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని.. ఇవి శరీరానికి కావాల్సిన ఖనిజాలను అందించడంలో సహాయపడతాయన్నారు.

చక్కెరతో కూడిన పండ్ల రసాలకు దూరంగా ఉండమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తాజా పండ్ల రసాలను ఆస్వాదించేటప్పుడు.. చక్కెర, ఐస్‌ను తప్పించండి. ఈ సీజన్‌లో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని డైట్‌లో చేర్చాలన్నారు. నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు, పులుపు తక్కువున్న పండ్లను తీసుకోవాలన్నారు. దోసకాయ, పొట్లకాయ, కీరా దోసకాయలు, జాక్‌ఫ్రూట్, మామిడి, పుచ్చకాయ, అరటి పండ్లు లాంటివి ఈ సీజన్‌లో తినడం ఉత్తమం.

ఇవి చదవండి: