Viral Photo: ఈ చిత్రంలో పాము దాగుంది.. సెకన్లలో కనిపెడితే మీరే జీనియస్!

ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. మరి ఆనందంతో పాటు మెదడుకు చురుకుదనాన్ని ఇవ్వాలంటే ఫోటో పజిల్సే సరైన ఆప్షన్...

Viral Photo: ఈ చిత్రంలో పాము దాగుంది.. సెకన్లలో కనిపెడితే మీరే జీనియస్!
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 05, 2022 | 9:07 AM

ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. మరి ఆనందంతో పాటు మెదడుకు చురుకుదనాన్ని ఇవ్వాలంటే ఫోటో పజిల్సే సరైన ఆప్షన్. ఫోటో పజిల్స్‌ను ఇష్టపడని వారెవరూ ఉండరు. అందరూ సవాళ్లను ఇష్టపడతారు. ఈ పజిల్స్ కూడా అంతే.. మనకు సవాల్‌ను విసురుతాయి. అందులో ఏముందో కనిపెట్టమని మనల్ని ట్రై చేయమంటాయి. ఇంకేముంది మనం కూడా తగ్గేదేలే అన్నట్లుగా వాటిని ఓ పట్టు పడతాం. సోషల్ మీడియాలో కూడా ‘ఈ ఫోటోలో పులి ఉంది’, ‘ఈ ఫోటోలో పాము ఉంది.. కనిపెట్టండి’ అనే పజిల్స్ కోకొల్లలు. తాజాగా ఈ కోవకు చెందిన ఓ ఫోటో పజిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటో చూసేద్దాం పదండి..

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో మీరు కనిపెట్టాలి. చూడటానికి ఓ ఇంటి ముందున్న మొక్కలు నాటే ప్రదేశంలా ఉంది కదూ.. అవునండీ.! కరెక్టే.. అక్కడే ఓ పాము దాగుంది. తల పైకెత్తి చూస్తోంది. మీ కళ్లకు పదునుపెట్టి తీక్షణంగా ఫోటోను పరిశీలిస్తే క్షణాల్లో గుర్తుపట్టేయొచ్చు. కొంచెం ఈజీ పజిలే. కొందరు ఈ ఫోటో‌లో పామును కనిపెట్టలేక బుర్ర గోక్కుంటుంటే.. మరికొందరు ఇందులో అసలు పాము లేదు.. వట్టి భ్రమ మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఓసారి ట్రై చేయండి. సమాధానం దొరికితే ఓకే.. లేదంటే కింద ఫోటోను చూడండి..

ఇవి చదవండి: