Arabic Kuthu: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న ‘అరబిక్ కుతు’ సాంగ్ తెలుగు వెర్షన్.. ఇంతకీ మీరూ విన్నారా ?..

అర్థం తెలీదు.. కానీ ఆ సాంగ్ వింటే ఎవ్వరైనా సరే కాలు కదపాల్సిందే. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఆ పాటకు స్టెప్పులేస్తూ అదుర్స్ అనిపిస్తున్నారు.

Arabic Kuthu: యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న 'అరబిక్ కుతు' సాంగ్ తెలుగు వెర్షన్.. ఇంతకీ మీరూ విన్నారా ?..
Beast
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 04, 2022 | 9:34 PM

అర్థం తెలీదు.. కానీ ఆ సాంగ్ వింటే ఎవ్వరైనా సరే కాలు కదపాల్సిందే. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఆ పాటకు స్టెప్పులేస్తూ అదుర్స్ అనిపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఎక్కడా విన్నా అదే పాట. భాషతో సంబంధం లేకుండా ప్రపంచం మొత్తం ఆ సాంగ్ వింటూ.. ఆడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ అదేం సాంగ్ అనుకుంటున్నారా ? అదే అరబిక్ కుతు.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అరబిక్ కుతు సాంగ్ తెగ ట్రెండ్ అవుతుంది. యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న ఈ సాంగ్ తక్కువ సమయంలోనే రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ఈ సాంగ్ అర్థం తెలియకపోయినా.. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా ఈ పాటకు అద్భుతంగా స్టెప్పులేస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సాంగ్ తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి (Vijay Thalapathy).. హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) జంటగా నటిస్తోన్న బీస్ట్ (Beast) సినిమాలోనిది. ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో ఏప్రిల్ 13న ఘనంగా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమాలోని అరబిక్ కుతు (హలమితి హబీబో) పాట తెలుగు వెర్షన్ విడుదలైంది. ఈ సాంగ్‏కు తమిళంలో హీరో శివకార్తికేయన్ సాహిత్యం అందించగా.. తెలుగులో శ్రీ సాయికిరణ్ సాహిత్యం అందించారు. అనిరుధ్, జోనితా గాంధీ ఆలపించారు. ప్రస్తుతం అరబిక్ కుతు తెలుగు వెర్షన్‏కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన తమిళ్ వెర్షన్ సాంగ్ యూట్యూబ్‏లో 260 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. భాష అర్థం కాకపోయినా.. పదాలు క్యాచీగా ఉండడం.. విజయ్, పూజా స్టెప్పులు.. మ్యూజిక్ శ్రోతలను కట్టిపడేసాయి. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు.

Also Read: Anchor Anasuya: మరోసారి నెటిజన్‏కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన అనసూయ.. ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారంటూ..

Varalaxmi Sarathkumar: టాలీవుడ్‏పై వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంట్రెస్ట్.. కొత్త ప్రాజెక్ట్ షూరు చేసిన జయమ్మ..

Sonam Kapoor: వెరైటీ చీరకట్టులో బేబి బంప్‏తో ఫోటో షూట్.. నెట్టింట్లో షేర్ చేసిన హీరోయిన్..

Nithin: మరో సినిమాను పట్టాలెక్కించిన నితిన్‌.. ‘పెళ్లి సందD’ ముద్దుగుమ్మ జంటగా..

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?