Varalaxmi Sarathkumar: టాలీవుడ్‏పై వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంట్రెస్ట్.. కొత్త ప్రాజెక్ట్ షూరు చేసిన జయమ్మ..

వరలక్ష్మీ శరత్ కుమార్  (Varalaxmi Sarathkumar)తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలలో

Varalaxmi Sarathkumar: టాలీవుడ్‏పై వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంట్రెస్ట్.. కొత్త ప్రాజెక్ట్ షూరు చేసిన జయమ్మ..
Varalaxmi
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 04, 2022 | 4:14 PM

వరలక్ష్మీ శరత్ కుమార్  (Varalaxmi Sarathkumar)తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నెగిటివ్ షెడ్స్ ఉన్న పాత్రలలో నటిస్తూ తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు వరలక్ష్మీ. ఇటీవల మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన క్రాక్ సినిమాలో పూర్తిగా నెగిటివ్ రోల్ చేసి మెప్పించారు. అలాగే.. నాంది సినిమాలో న్యాయవాది పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్నారు. భాషతో సంబంధం లేకుండా ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు వరలక్ష్మీ శరత్ కుమార్. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ఇప్పుడు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘శబరి’. మహా మూవీస్ పతాకంపై మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్రనాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అనిల్ కాట్జ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా పూజా కార్యక్రమాల నిర్వహించి నిరాడంబరంగా ప్రారంభించారు.

ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు మదన్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా, నిర్మాత ‘నాంది’ సతీష్ వేగేశ్న క్లాప్ ఇచ్చారు. సీనియర్ దర్శకులు బి. గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. సీనియర్ నిర్మాత పోకూరి బాబూరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సినిమా ప్రారంభమైన సందర్భంగా కాన్సెప్ట్ పోస్టర్ విడుదల చేశారు. దర్శకుడు అనిల్ కాట్జ్ మాట్లాడుతూ “క్రైమ్ నేపథ్యంలో రూపొందిస్తున్న ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర చిత్రానికి ప్రధాన ఆకర్షణ. గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, ప్రభు తదితరులు ఇతర తారాగణం. గోపిసుందర్ స్వరాలు చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. టాలెంటెడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ తో దర్శకుడిగా నా తొలి సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత మహేంద్రనాథ్ గారికి థాంక్స్” అని అన్నారు. చిత్రనిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ “వరలక్ష్మీ శరత్ కుమార్ గారు ఇంతకు ముందు ఎప్పుడూ చూడని కొత్త పాత్ర ‘శబరి’లో చేస్తున్నారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. కథ, కథనాలు సరికొత్తగా ఉంటాయి. ఈ నెల 11 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, విశాఖ, కొడైకెనాల్ వంటి అందమైన ప్రదేశాల్లో చిత్రీకరణ చేస్తాం” అని చెప్పారు. ఈ సినిమాలో గణేష్ వెంకట్రామన్, శశాంక్, మైమ్ గోపి, సునయన, రాజశ్రీ నాయర్, ప్రభు, కృష్ణతేజ, బిందు పగిడిమర్రి, ఆశ్రిత వేముగంటి, హర్షిని కోడూరు, అర్చన అనంత్, కామాక్షి భాస్కర్ల, ‘రచ్చ’ రవి, బేబీ నివేక్ష, బేబీ కృతిక, ‘వైవా’ రాఘవ, హరిశ్చంద్ర నటిస్తున్నారు.

Also Read: Yami Gautam: హ్యాక్‌కు గురైన నటి యామీ గౌతమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌.. అప్రమత్తంగా ఉండండి అంటూ..

Hyderabad Traffic Police: దర్శకుడు త్రివిక్రమ్‌ కారు తనిఖీ.. జరిమానా విధించిన పోలీసులు

Nithin: మరో సినిమాను పట్టాలెక్కించిన నితిన్‌.. ‘పెళ్లి సందD’ ముద్దుగుమ్మ జంటగా..

Piyush Goyal: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. ధన్యవాదాలు తెలిపిన మూవీ యూనిట్‌..

PIN నమోదు చేయకుండా Paytm ద్వారా చెల్లింపులు.. కొత్త సిస్టమ్‌!
PIN నమోదు చేయకుండా Paytm ద్వారా చెల్లింపులు.. కొత్త సిస్టమ్‌!
ఢాకాలో ఇస్కాన్‌ గురువు చిన్మయ్‌ ప్రభు అరెస్ట్‌ హిందువుల్లో ఆగ్రహం
ఢాకాలో ఇస్కాన్‌ గురువు చిన్మయ్‌ ప్రభు అరెస్ట్‌ హిందువుల్లో ఆగ్రహం
హైదరాబాద్‌లో అగ్నివీర్‌ నియామక ర్యాలీ.. దళారుల మాయలో పడొద్దు!
హైదరాబాద్‌లో అగ్నివీర్‌ నియామక ర్యాలీ.. దళారుల మాయలో పడొద్దు!
మంగళవారం ఈ 5 పనులు చేస్తే.. కోరుకున్న పనులు జరుగుతాయి..
మంగళవారం ఈ 5 పనులు చేస్తే.. కోరుకున్న పనులు జరుగుతాయి..
ఆదాయంలో దూసుకుపోతున్న పతంజలి..3 నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?
ఆదాయంలో దూసుకుపోతున్న పతంజలి..3 నెలల్లో ఎంత లాభం వచ్చిందో తెలుసా?
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
MBBS స్పెషల్‌ ‘స్ట్రే’ కౌన్సెలింగ్‌.. ఇవాళ మధ్యాహ్నం వరకే ఛాన్స్‌
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ప్రధాని మోడీ విశాఖ పర్యటన రద్దు
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
వెయ్యి రూపాయలు తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా?
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
BSc (హానర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి
ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఏ శుభసమయంలో విష్ణువును పూజించాలో తెలుసుకోండి