AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yami Gautam: హ్యాక్‌కు గురైన నటి యామీ గౌతమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌.. అప్రమత్తంగా ఉండండి అంటూ..

Yami Gautam: ప్రస్తుత కాలంలో సోషల్‌ మీడియా (Social Media) అకౌంట్‌ లేని వారిని భూతద్దంలో వెతికినా కనిపించే పరిస్థితి లేదు. అంతలా మన జీవితాల్లో భాగమైపోయింది. స్మార్ట్‌ ఫోన్‌ (Smartphone) వినియోగం పెరగడంతో ప్రతీ ఒక్కరూ..

Yami Gautam: హ్యాక్‌కు గురైన నటి యామీ గౌతమ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌.. అప్రమత్తంగా ఉండండి అంటూ..
Yami Gautam
Narender Vaitla
|

Updated on: Apr 04, 2022 | 12:38 PM

Share

Yami Gautam: ప్రస్తుత కాలంలో సోషల్‌ మీడియా (Social Media) అకౌంట్‌ లేని వారిని భూతద్దంలో వెతికినా కనిపించే పరిస్థితి లేదు. అంతలా మన జీవితాల్లో భాగమైపోయింది. స్మార్ట్‌ ఫోన్‌ (Smartphone) వినియోగం పెరగడంతో ప్రతీ ఒక్కరూ సోషల్‌ మీడియాను ఉపయోగిస్తున్నారు. అయితే టెక్నాలజీ పెరిగిందని సంతోషించేలోపే దానిని అనుకూలంగా మార్చుకుంటూ నేరాలకు పాల్పడుతోన్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. సోషల్‌ మీడియాలో ఉపయోగిస్తున్న వారికి హ్యాకింగ్ ఇప్పుడు పెద్ద తల నొప్పిగా మారింది. ముఖ్యంగా సెలబ్రిటీల అకౌంట్‌లు హ్యాకింగ్‌ గురికావడం ఇటీవల సర్వసాధారణంగా మారిపోయింది. ప్రముఖ నటీనటులు సోషల్‌ మీడియాలో అకౌంట్‌లను హ్యాక్‌ చేస్తూ అసంబంధిత పోస్టులు చేస్తున్నారు కొందరు సైబర్‌ నేరగాళ్లు.

ఈ క్రమంలోనే తాజాగా నటి యామీ గౌతమ్‌ అకౌంట్‌ను కూడా హ్యాక్‌ చేశారు. ఈ విషయాన్ని యామీ స్వయంగా ప్రకటించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను హ్యాక్‌ చేశారంటూ ట్విట్టర్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేసింది. ఈ విషయమై యామీ గౌతమ్‌ ట్వీట్‌ చేస్తూ.. ‘నిన్నటి నుంచి నేను నా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను వాడలేకపోతున్నాను. బహుశా అకౌంట్‌ హ్యాక్‌కు గురైనట్లుంది. అకౌంట్‌ను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నాము. ఇంతలోపు నా అకౌంట్‌ నుంచి ఏమైనా అసాధారణ పోస్టింగ్‌ వస్తే వాటితో జాగ్రత్తగా ఉండండి’ అంటూ పోస్ట్‌ చేశారు.

ఇదిలా ఉంటే ఫేర్‌ అండ్‌ లవ్లీ ప్రకటనతో దేశవ్యాప్తంగా ఎంతో మందికి పరిచయమైన యామీ బాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. ఇక ‘నువ్విలా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది. అనంతరం ‘గౌరవం’, ‘కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌’ వంటి సినిమాల్లో నటించింది. ఇటీవల అభిషేక్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘దస్వీ’ చిత్ర షూటింగ్‌ను కంప్లీట్ చేసిన ఈ చిన్నది.. ప్రస్తుతం ‘ఓ మై గాడ్‌ సిక్వెల్‌’లో నటిస్తోంది.

Also Read: Corona Virus: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి.. రెండేళ్ల తర్వాత వెయ్యి లోపు కేసుల నమోదు

Mehreen Pirzada: ‘మావి రాత్రి జీవితాలు’ ఆ సంఘటనను గుర్తు చేసుకున్న హీరోయిన్.. సినీ జీవితం అంటేనే అంత..

Hair loss: జుట్టు రాలడానికి ఇవి కూడా కారణమే! వీటితో జాగ్రత్త..