Corona Virus: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా వ్యాప్తి.. రెండేళ్ల తర్వాత వెయ్యి లోపు కేసుల నమోదు
Corona Virus: రెండేళ్లకు పైగా ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టించిన కరోనా వైరస్.. వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ముఖ్యంగా మన దేశంలో కోవిడ్ 19(Covid 19) బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ తగ్గుతున్నట్లు..
Corona Virus: రెండేళ్లకు పైగా ప్రపంచ దేశాల్లో కల్లోలం సృష్టించిన కరోనా వైరస్.. వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ముఖ్యంగా మన దేశంలో కోవిడ్ 19(Covid 19) బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ తగ్గుతున్నట్లు.. అదే సమయంలో రికవరీ రేటు గణనీయంగా పెరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజగా దేశంలో వెయ్యికి దిగువున కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు 913 నమోదయ్యాయి. దీంతో 715 రోజుల తర్వాత రోజువారీ పాజిటివ్ కేసులు వెయ్యిలోపు నమోదవడం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. కరోనా యాక్టివ్ కేసులు 13 వేల దిగువకు చేరడం గత 714 రోజుల్లో ఇదే తొలిసారని ఆరోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో కరోనాతో 13 మంది మరణించారని.. 1,316 మంది కోలుకున్నారని తెలిపింది.
ఇక కొత్తగా నమోదైన కేసులతో దేశంలో ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన బాధితుల సంఖ్య 4,30,29,044కు చేరింది. వీరిలో ఇప్పటి వరకూ 4,24,95,089 మంది కోలుకున్నారు. దేశంలో కోవిడ్ బారిన పడి 5,21,358 మంది మృతిచెందినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. అంతేకాదు కరోనా తో 12,597 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 0.29 శాతంగా ఉండగా.. రికవరీ రేటు గణనీయంగా పెరిగి.. ప్రస్తుతం 98.76 శాతంగా ఉందని పేర్కొంది. యాక్టివ్ కేసులు 0.03 శాతం ఉందని తెలిపింది. దేశ వ్యాప్తంగా బూస్టర్ డోసు తో పాటు 12 ఏళ్ళనుంచి 18 ఏళ్ల వయసు యువతీ యువకులకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం 1,84,70,83,279 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది. అయితే మరో వైపు చైనా, హాంకాంగ్, దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాల్లో కరోనా వైరస్ ఓ రేంజ్ లో విజృంభిస్తున్న సంగతి తెలిసిందే.
Viral Video: అయ్యో.. అయ్యో.. అయ్యయ్యో..! ఎరక్కపోయి ఇరుక్కుపోయిన పిల్లి.. వీడియో వైరల్