Viral Video: షాప్‌లో తండ్రి ఏమీ తినడం లేదని చిన్నారి ఆందోళన.. మీ నాన్న అదృష్టవంతుడు అంటున్న నెటిజన్లు .. వీడియో వైరల్

Viral Video: తల్లి పిల్లలని నవమాసాలు మొస్తే . తండ్రి జీవితాంతం తన బిడ్డలను గుండెల్లో మోస్తాడు. నాన్న ప్రేమ కొలవడానికి వీలులేనంత.. ఇక తండ్రి కూతురు(Father and Daughter) మధ్య బంధం, అనుబంధం గురించి ఎంత..

Viral Video: షాప్‌లో తండ్రి ఏమీ తినడం లేదని చిన్నారి ఆందోళన.. మీ నాన్న అదృష్టవంతుడు అంటున్న నెటిజన్లు .. వీడియో వైరల్
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Apr 04, 2022 | 10:21 AM

Viral Video: తల్లి పిల్లలని నవమాసాలు మొస్తే . తండ్రి జీవితాంతం తన బిడ్డలను గుండెల్లో మోస్తాడు. నాన్న ప్రేమ కొలవడానికి వీలులేనంత.. ఇక తండ్రి కూతురు(Father and Daughter) మధ్య బంధం, అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే.. కూతురుకి నాన్నపై ఉన్న ప్రేమ ఆకాశమంత.. తండ్రికి కూతురు అంటే అపురూపం.. కూతురు అంటే తనకు మరో అమ్మే అని .. ఇంటికి లక్ష్మీదేవి(lakshmi Devi) అని ఎంతో గారంగా పెంచుకుంటాడు. తండ్రి కూతురు మధ్య బంధాన్ని మరో సారి తెలియస్తోంది ఓ వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మీరు కూడా ఆ కూతురికి తండ్రి మీద ఉన్న ప్రేమకు ఎమోషనల్ అవుతారు.

ఈ వీడియో చూసిన ఎవరికైనా తండ్రి కూతురు మధ్య ఉన్న అనుబంధం మది గదిని తడుతుంది. ఓ చిన్నారి బాలిక ఏడుస్తుంది.. తల్లి ఎందుకు ఏడుస్తున్నావు అంటే.. ముందు నువ్వు వీడియో రికార్డ్ చేయడం ఆపెయ్యి.. చెబుతా అంటున్నది.. దీంతో తల్లి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావో కారణం చెప్పు నేను వీడియో రికార్డ్ చేయడం ఆపేస్తా అంటుంది. అప్పుడు కూతరు అమ్మ.. నాన్న ఏమీ సరిగా తినడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తోంది. తన తండ్రి ఏమీ తినడకుండా షాప్ కు వెళ్లిపోయాడని ఏడుస్తోంది.

అమ్మా నాకు నాన్న బాగా గుర్తుకొస్తున్నారు.. ఆయన ఏమీ తినకుండా దుకాణానికి వెళ్లిపోయారు.. ఇక సాయంత్రం వరకూ ఏమీ తినరు..దుకాణంలో ఖాళీ కడుపులోనే పని చేస్తారు.. ఏమీ తినరు తాగరు అలా ఖాళీ కడుపుతోనే మళ్ళీ ఇంటికి వచ్చే వరకూ ఉంటారు. ఎప్పుడు చూడు పని పని అంటారు అని చెబుతుంది. దీంతో తల్లి తాను పొద్దున్నే తినడానికి పెట్టానని.. అది తినేసి దుకానికి వెళ్లారని సమాధానం చెబుతుంది. అప్పుడు చిన్నారి పొద్దున్న తర్వాత రాత్రి మాత్రమే తింటారు.. నువ్వు చెప్పు అమ్మా .. సాయంత్రం ఏమీ అలాగే ఖాళీ కడుపుతో ఉంటారు.. నాకు నాన్న గురుంచి చాలా టెన్షన్ గా ఉంది. అలా ఏమీ తినకుండా తాగకుండా ఉంటె ఎలా అని అమ్మని ప్రశ్నిస్తూనే కన్నీరు పెట్టుకుంది. నాకే కాదు ప్రపంచంలో ప్రతి పిల్లలకు తన తండ్రి గురించి టెన్షన్ ఉంటుంది. ఏమీ తినక పోవడం వలన నాన్న సన్నగా అయిపోతున్నారు. నాన్న తినడానికి కూర్చుంటే ,…కస్టమర్స్ తిరిగి వెళ్ళిపోతారుగా అందుకే మీ నాన్న తినరు అని తల్లి.. కూతురుని సమాధాన పరచడానికి ట్రై చేసింది.. అప్పుడు అమ్మా ప్రతి మనిషి తింటారు కదా .. మరి కష్టమర్ కొంచెం సేపు ఎందుకు ఉండరు.. నాన్న తినే వరకూ అని తెలివిగా కూతరు అడిగింది. నేను నాన్న కోసం ఏమి చేయాలి.. ఏమి చేయగలను అంటూ తల్లిని అడుగుతుంది.. తనలో తానే తండ్రి ఆరోగ్యం గురించి చిన్నారి ఆలోచిస్తోంది.. ఈ వీడియో చూస్తే .. తండ్రి కూతురు అనుబంధం అంటే ఇదేకదా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నీలాంటి కూతురుని కన్నా నీ తండ్రి అదృష్ట వంతుడు అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: One Euro Houses: కరోనా ఫ్రీ గ్రామంలో రూ.85లకు ఇంటి కొనుగోలు.. తిరిగి ఎంతకు అమ్మాడో తెలుసా!..

పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
పెళ్లైన హీరోలతో ప్రేమ వ్యవహారాలు.. 50 ఏళ్లయినా సింగిల్ గానే
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
మన్మోహన్‌కు ఆ కారు అంటే ఎంతో ఇష్టమట.. ఆయన సింప్లిసిటీకి నిదర్శనం
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
వెంకటేశ్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
మీ చేతి వేళ్ల ఆకారం మీ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పేస్తుందట..
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
రోహిత్ శర్మ కూడా ఆ ప్లేయర్‌లానే అప్పుడే రిటైర్మెంట్?
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
కారు కొనేందుకు మన్మోహన్ సింగ్ వద్ద నగదు లేని సందర్భం ఎప్పుడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
18 కోట్లతో మాజీ ప్రధాని బయోపిక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే..