One Euro Houses: కరోనా ఫ్రీ గ్రామంలో రూ.85లకు ఇంటి కొనుగోలు.. తిరిగి ఎంతకు అమ్మాడో తెలుసా!..
One Euro Houses: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. ఏ దేశంలోని వారికైనా సొంత ఇంటి కల ఉంటుంది. తమకు ఒక గూడు నీడ ఏర్పరచుకోవాలి.. ఎంతో కష్టపడతారు. అయితే రోజు రోజుకీ భూమి..
One Euro Houses: ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు.. ఏ దేశంలోని వారికైనా సొంత ఇంటి కల ఉంటుంది. తమకు ఒక గూడు నీడ ఏర్పరచుకోవాలి.. ఎంతో కష్టపడతారు. అయితే రోజు రోజుకీ భూమి ధరలతో పాటు నిర్మాణం ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యుడికి ఇల్లు కట్టాలన్న.. కొనుక్కోవాలన్నా లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సి వస్తుంది.. దీంతో సొంత ఇల్లు అనేది సాధ్యం కాని పని అయిపోతుంది. తీరని కలగా మిగిలిపోతుంది. అయితే ఓ వ్యక్తి.. ఓ ఇల్లుని రూ. 85 లకు కొన్నాడు.. ఆ సంతోషం ఎన్నో ఈరోజులు ఉండలేదు.. తిరిగి అదే ఇంటిని ఇప్పుడు అమ్మేశాడు.. ఈ ఘటన యూరోపియన్ దేశమైన(European countries) ఇటలీ(Italy)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
ఇటలీలోని చిన్న పట్టణాలు, గ్రామాల్లో తిరిగి కళ తీసుకుని రావడానికి జనసాంద్రత పెరగడానికి ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంది. వాటిల్లో భాగంగా ‘కేస్ 1 యూరో’ అని(మన కరెన్సీలో ఒక యూరో అంటే రూ.85 ) ఆ పథకం పేరుతో కొన్ని షరతులతో కేవలం ఒక యూరోకే ఇళ్లను అమ్ముతోంది. అయితే కండిషన్స్ అప్లై.. అంటే ఈ పథకంలో కేవలం విదేశీయులకు ఇళ్లను విక్రయిస్తోంది ప్రభుత్వం. ఇలా చేయడం వలన… ఆ ప్రాంతం పర్యాటక రంగంగా అభివృద్ధి చెందుతుందని భావించింది. ఈ నేపథ్యంలో 14వ శతాబ్ధం నాటి పురాతన గ్రామం ముస్సోమెలిలో కూడా విదేశీయుల సంఖ్య పెంచి పూర్వ వైభవం తీసుకుని రావాలని ఆ నగర అధికారుల ప్లాన్ వేశారు.
View this post on Instagram
నగరంలోని పురాతన ఇళ్లను తక్కువ ధరకు అమ్మకం పెట్టారు. దీంతో బ్రిటన్‌కు చెందిన డానీ మెక్ కబ్బిన్ అనే 58 ఏళ్ల వ్యక్తి సిసిలీ నగరంలోని ఓ ఇంటిని ఒక యూరోకే (రూ.85) ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. తక్కువ ధరకు ఇంటిని సొంతం చేసుకున్నందుకు ఆనందంతో ఉబ్బితబ్బయ్యాడు. అయితే ఆ ఇల్లు పాతది కనుక మార్పులు చేయాలని.. రిపేర్ చేయించాలని, శుభ్రం చేయించుకోవాలని భావించాడు. పనివారి కోసం వెదకడం ప్రారంభించాడు. అయితే ఇల్లు శుభ్రం చేయడానికి ఒక్కరూ కూడా అతనికి దొరకలేదు. తాను ఇంటిని శుభ్రం చేసుకుందామా అంటే.. వయసు రీత్యా శరీరం సహకరించలేదు. దీంతో ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఇంటికి మళ్ళీ మెక్ అమ్మకానికి పెట్టాడు. అతి కష్టం మీద తాను కొన్న ధరకే తిరిగి అమ్మేశాడు..అంటే రూ. 85 లకె ఇంటిని తిరిగి అమ్మేశాడు. ఎలాగోలా ఒక బిల్డర్ ఆ ఇంటిని కొన్నాడు. తిరిగి తన స్వగ్రామానికి చేరుకున్నాడు. కరోనా తర్వాత ఇటలీలో పరిస్థితులు మారిన సంగతి తెలిసిందే..ఆ దేశం ఇప్పుడు భారీగా కార్మికుల కొరత ఎదుర్కొంటుందని తెలుస్తోంది.