Hyderabad: మానవత్వం ఎక్కడ..? అంగవైకల్యం ఉందని 3 రోజుల బాలుడిని కవర్‌లో పెట్టి వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు
Hyderabad: ప్రపంచంలో అన్ని బంధాల కంటే పేగు బంధం గొప్పది అని అంటారు.. నవమాసాలు మోసి.. కని.. కంటి రెప్పలా కాచుకుంటూ.. తన బిడ్డలను పెంచుకుంటుంది తల్లి.. తాను తిన్నా తినకపోయినా..
Hyderabad: ప్రపంచంలో అన్ని బంధాల కంటే పేగు బంధం గొప్పది అని అంటారు.. నవమాసాలు మోసి.. కని.. కంటి రెప్పలా కాచుకుంటూ.. తన బిడ్డలను పెంచుకుంటుంది తల్లి.. తాను తిన్నా తినకపోయినా తన పిల్లలు కడుపునిండా తింటే.. తాను తిన్నట్లే సంబరపడిపోయే అల్పసంతోషి తల్లి(Mothers Love).. అయితే రోజు రోజుకీ పేగు బంధం, మానవత్వం (Humanity) మనిషి నుంచి మాయమైపోతుంది. ఇంకా చెప్పాలంటే అమ్మతనానికి మచ్చ తెచ్చే సంఘటనలు రోజు రోజుకీ సమాజంలో అనేకం చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ పసివాడిని కవర్ లో పెట్టి రోడ్డుమీద వదిలి పెట్టిన దారుణ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
నగరంలోని ప్రముఖ పిల్లల ఆస్పత్రి నిలోఫర్ ఆసుపత్రి లో ఓ కవర్ లో బాబు ప్రత్యక్షమయ్యాడు. ఆసుపత్రి ప్రాంగణంలో 3రోజుల బాబును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. కవర్ లో బాబు ని పెట్టి ఒక ఆటోలో వదిలి పెట్టినట్లు తెలుస్తోంది. బాబుని ఎస్‌పిఎఫ్ గమనించింది. వెంటనే బాబుని కవర్ నుంచి బయటకు తీసి ఆసుపత్రి లో ఎస్‌పిఎఫ్ సిబ్బంది అడ్మిట్ చేసింది. శిశువుకి వైద్య పరీక్షలు చేసిన వైద్య సిబ్బంది.. బాలుడికి మూడు రోజులు ఉండవచ్చని.. పచ్చకామెర్లు తో ఇబ్బంది పడుతున్నాడని.. అంతేకాదు అంగ వైకల్యం కూడా ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని.. బాలుడి గురించి ఇతర వివరాలను, తల్లిదండ్రులను గుర్తించే పనిలో ఉన్నారు.
Watch Video: బోర్ కొడుతుందని చేపలు పట్టేందుకు వెళ్లాడు.. చివరకు ఊహించని షాక్.. వీడియో వైరల్
Primeval Foods: త్వరలో అంగడిలో అమ్మకానికి సింహం, పులి, ఏనుగు మాంసాలు.. వెరైటీ వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్‌కి రెడీ.. ఎక్కడంటే