GMC Mahabubnagar Jobs: మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 98 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.1,90 వేల జీతం..

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ డైరెక్టరేట్‌ కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి..

GMC Mahabubnagar Jobs: మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 98 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.1,90 వేల జీతం..
Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 04, 2022 | 8:10 AM

Mahabubnagar Govt Medical College Professor Recruitment 2022: తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ డైరెక్టరేట్‌ కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల (Assistant Professor Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 98

పోస్టుల వివరాలు:

  • అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులు: 60
  • సివిల్‌ అసిస్టెంట్ సర్జన్‌ పోస్టులు: 10
  • ప్రొఫెసర్‌ పోస్టులు: 2
  • అసోసియేట్‌ ప్రొపెసర్ పోస్టులు: 15
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు: 4
  • ట్యూటర్లు: 7

విభాగాలు: అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, పాథాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, పీడియాట్రిక్స్‌, జనరల్‌ మెడిసిన్‌, జనరల్ సర్జరీ, అనెస్తీషియా, అబ్‌స్టెటిక్స్‌ అండ్‌ గైనకాలజీ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 44 ఏళ్లకు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.52,000ల నుంచి రూ.1,90,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అభ్యర్ధులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 12, 2022.

అడ్రస్‌: గవర్నమెంట్‌ మెడికల్ కాలేజీ/గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌, మహబూబ్‌నగర్‌, తెలంగాణ.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్‌ 8, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

Telangana Govt Jobs: నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో టీచింగ్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారా? 3 రోజుల్లో..