Primeval Foods: త్వరలో అంగడిలో అమ్మకానికి సింహం, పులి, ఏనుగు మాంసాలు.. వెరైటీ వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్‌కి రెడీ.. ఎక్కడంటే

Primeval Foods: మనదేశం(India)లో మాంసాహార ప్రియులు ఎక్కువగా కోడి, మేక, గొర్రె వంటి వాటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. కొంతమంది పందిని కూడా ఆహారంగా తీసుకుంటారు. అయితే కూరగాయల్లో..

Primeval Foods: త్వరలో అంగడిలో అమ్మకానికి సింహం, పులి, ఏనుగు మాంసాలు.. వెరైటీ వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్‌కి రెడీ.. ఎక్కడంటే
Primeval Foods In London
Follow us
Surya Kala

|

Updated on: Apr 04, 2022 | 8:03 AM

Primeval Foods: మనదేశం(India)లో మాంసాహార ప్రియులు ఎక్కువగా కోడి, మేక, గొర్రె వంటి వాటిని మాత్రమే ఆహారంగా తీసుకుంటారు. కొంతమంది పందిని కూడా ఆహారంగా తీసుకుంటారు. అయితే కూరగాయల్లో ఎన్నో వెరైటీలున్నట్లు.. మాంసంలో కూడా డిఫరెంట్ జంవుతుల మాంసాలు ఉంటె బాగుండును అని చాలా మంది ఆలోచిస్తారు. అలాంటి వారి కోసం ఇప్పుడు కొత్త రకాల మాంసాలు అందుబాటులోకి వస్తున్నాయి. ఏకంగా అడవికి రారాజు సింహం మాంసం(Lion Meat) నుంచి పులి, జీబ్రా, ఏనుగు వంటి అడవి జంతువుల మాంసాహార వంటకాలు అందుబాటులోకి రానున్నాయి.. వీరి మాంసంతో ఓ ఫుడ్ మెనూ కూడా రెడీ చేశారు.. సింహం బర్గర్, పులి మాంసం నగ్గెట్స్, ఏనుగు నూనెతో చేసిన క్రీమీ చీజ్ ​కేక్, జీబ్రా సుషీ రోల్స్, జిరాఫీ హ్యామ్… అంటూ డిఫరెంట్ మెనూ త్వరలో జరగబోయే ఫుడ్ ఫెస్టివల్ కోసం రెడీ చేశారు నిర్వాహకులు..  త్వరలో పులి, సింహం, జీబ్రా, ఏనుగు వంటి మాంసాలు అంగడిలో అందుబాటులో రానున్నాయి. అయితే మనదేశంలో మాత్రం కాదు.. ఎక్కడో ఈ వెరైటీ మీట్ లభిస్తుందో వివరాల్లోకి వెళ్తే..

మనదేశంలో మాంసాహారం అంటే చికెన్, మటన్ లు ఎక్కువ.. కొన్ని దేశాల్లో వీటికి తోడు బీఫ్ పోర్క్ జత చేసుకుంటారు. ఇక చైనా లో అయితే కుక్కలు, గాడిదలు, పిల్లులు సహా అన్ని తినదగినవే అంటారు. కానీ ఇప్పటి వరకూ ఏ దేశం కూడా వన్యప్రాణుల మాంసాన్ని మెనుగా పెట్టి…ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయలేదు.  ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా వన్య ప్రాణులను వేటాడడం, తినడం చట్టవిరుద్ధం. అసలు వాటి మాంసం తినాలన్న ఆలోచన కూడా ఇప్పటి వరకూ రాలేదనే చెప్పవచ్చు. అయితే లండన్ లో ఓ సంస్థ  వెరైటీగా సింహం, పులి, జీబ్రా మాంసాలను  ఆహారప్రియులకు అందించడానికి అందుబాటులోకి తీసుకుని రానుంది.

లండన్ కేంద్రంగా పనిచేసే ప్రిమేవల్ ఫుడ్స్ అనే అంకుర సంస్థ సెల్యూలర్ వ్యవసాయంతో ముడిపడిన వ్యాపారం చేస్తోంది. ఈ క్రమంలోనే జంతువుల జోలికి వెళ్లకుండా ల్యాబ్ ​లోనే వన్యమృగాల మాంసాన్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదని అనుకుంది. వెంటనే ల్యాబ్లోనే వన్యమృగాల మాంసాన్ని తయారు చేయడానికి రెడీ అయింది.  ల్యాబ్​ లో మాంసం అభివృద్ధి కొత్తేం కాదు. జంతువుల కణాలను ప్రాసెస్(సెల్ కల్చరింగ్) చేసి పరిశోధనశాలలోనే తయారు చేసిన చికెన్, మటన్ వంటివి ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయి.

Zebra Sushi

Zebra Sushi

ఆ మాంసాలతో టైగర్ స్టిక్స్, జీబ్రా సుషీ రోల్స్ తయారుచేయనున్నారు. అలాగే ఎలిఫెంట్ ఆయిల్‌ను కూడా ఉత్పత్తి చేయనున్నారు. స్థానిక మార్కెట్లు, సూపర్ మార్కెట్లలో సింహం, పులి, జీబ్రా మాంసాలను విక్రయించనున్నారు. ఈ మాంసాలతో రకరకాల పదార్థాలు చేసి లండన్ రెస్టారెంట్లలో వడ్డించనున్నారు. అంతేకాదు త్వరలోనే ఈ సంస్థ ఫుడ్‌ ఫెస్టివల్‌ ను కూడా నిర్వహించనుంది. అక్కడ రకరకాల వంటకాలను చేసి పెట్టనున్నారు. దీనికి సంబంధించి ఓ మెనూను కూడా విడుదల చేశారు. ఇప్పుడు ప్రజలు కొత్తదనం కోరుకుంటున్నారని.. అందుకనే తాము వన్యమృగాల మాంసాన్ని తయారు చేయాలని నిర్ణయించుకున్నామని ప్రిమేవల్ ఫుడ్స్ పెట్టుబడిదారి సంస్థ అయినా ఏస్ వెంచర్స్ మేనేజింగ్ పార్టనర్ యిల్మాజ్ బోరా చెప్పారు.

Primeval Foods In London 2

Primeval Foods In London 2

Also Read : Nurses Dance: ఆసుపత్రిలో డాన్సులు చేసిన నర్సులు.. లేచి కూర్చున్న కోమాలోని పేషెంట్..!