AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Piyush Goyal: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. ధన్యవాదాలు తెలిపిన మూవీ యూనిట్‌..

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియా సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

Piyush Goyal: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. ధన్యవాదాలు తెలిపిన మూవీ యూనిట్‌..
Piyush Goyal
Basha Shek
| Edited By: Narender Vaitla|

Updated on: Apr 04, 2022 | 8:32 AM

Share

RRR Movie: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియా సినిమా ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) కలెక్షన్లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ (Ramcharan), ఎన్టీఆర్‌ (JR.NTR)ల అభినయంపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా కబుర్లే.. ముచ్చట్లే.. ఈక్రమంలో కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ జక్కన్న సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో దేశ ఆర్థిక పరిస్థితి గురించి ప్రస్తావించిన ఆయన.. ‘భారతదేశ అతిపెద్ద సినిమా RRR సినిమా తొలి ఏడు రోజుల్లోనే రూ.750 కోట్లు వసూలు చేసినట్లు విన్నాను. ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తున్నట్లే ఇండియన్ ఎకానమీ కూడా రికార్డులను బద్దలు కొడుతుంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ రికార్డు స్థాయిలో 418 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేయడమే దీనికి నిదర్శనం’ అని చెప్పుకొచ్చారు. కాగా ఈ ఏడాది భారత్ 400 బిలియన్ డాలర్ల ఎగుమతులను టార్గెట్ పెట్టుకుందని.. మార్చి 23న ఆ టార్గెట్‌ను అధిగమించామని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు.

కాగా పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై ఆర్‌ఆర్‌ఆర్‌ టీం స్పందించింది. ట్విట్టర్‌ వేదికగా ఆయనకు ధన్యవాదాలు తెలిపింది. ‘ థ్యాంక్యూ పీయూష్ గోయల్‌ జీ. దేశ అభివృద్ధిలో మా సినిమా భాగమైనందుకు ఎంతో సంతోషిస్తున్నాం. మా సినిమాలాగే మరిన్ని సినిమాలు వరల్డ్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు తిరిగరాయాలని కోరుకుంటున్నాం’ అని ఈ సందర్భంగా తెలిపింది. కాగా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటివరకు రూ. 750 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ పండితులు పేర్కొన్నారు. ఇక ఉత్తరాదిలోనూ రూ.100 కోట్ల మార్క్‌ ను క్రాస్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో రూ. 350కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు సమాచారం.

Also Read: Hyderabad: డ్రగ్స్‌ కేసులో నా కొడుకుకు సంబంధం లేదు.. వేధించవద్దు: ఉప్పల శారద

Ramzan 2022: ఉపవాస సమయంలో ఈ ఆరోగ్య చిట్కాలు పాటించండి.. ఫిట్‌గా ఉండండి..!

రిప్డ్ జీన్స్‌ స్టైలిష్ టాప్ లో ఎట్రాక్ట్ చేస్తున్న రకుల్ ప్రీత్