Hyderabad: డ్రగ్స్‌ కేసులో నా కొడుకుకు సంబంధం లేదు.. వేధించవద్దు: ఉప్పల శారద

Hyderabad: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పుడింగ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసు సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. రాత్రి పబ్‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు..

Hyderabad: డ్రగ్స్‌ కేసులో నా కొడుకుకు సంబంధం లేదు.. వేధించవద్దు: ఉప్పల శారద
Follow us

|

Updated on: Apr 03, 2022 | 11:04 PM

Hyderabad: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పుడింగ్‌ మింక్‌ పబ్‌ డ్రగ్స్‌ కేసు సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. రాత్రి పబ్‌పై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి డ్రగ్స్‌ (Drugs)ను స్వాధీనం చేసుకోవడంతో పాటు యజమానులతో సహా 142 మంది జాబితాను పోలీసులు విడుదల చేశారు. ఈ పార్టీకి హాజరైన వారిలో బిగ్ సెలబ్రిటీలు, ప్రముఖులు, ఉన్నతాధికారుల పిల్లలు కూడా ఉన్నారు. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తదితరులున్నారు. ఈ వ్యవహారం పూర్తిగా పొలిటికల్‌ మలుపు తిరుగుతోంది. అయితే  ఈ వ్యవహారంలో పబ్‌ యజమానిగా జాబితాలో పేరున్న అభిషేక్‌పై ఆయన తల్లి ఉప్పల శారద స్పందించారు. డ్రగ్స్‌ కేసులో అభిషేక్‌ పేరు ఉండటంతోపై ఆమె స్పందించి మీడియాతో మాట్లాడారు. పబ్‌ కేసుపై ఆమె బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. నా కొడుకుపై అసత్య ప్రచారాలు చేయవద్దని, నా కొడుకు నిరపరాధి అని అన్నారు. ఎవరో తెచ్చుకున్న డ్రగ్స్‌కు నా కొడుకును బలి చేయవద్దని కోరారు. నా కొడుకు అభిషేక్‌ను వేధించవద్దని శారద పోలీసులను వేడుకున్నారు. కాగా, శారద గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉండగా, ఇప్పుడు బీజేపీలో కొనసాగుతున్నారు.

అసలు పబ్‌కి నా కొడుకు ఓనర్ కాదు.. కేవలం పార్టనర్ మాత్రమే. రాడిసన్ హోటల్ ఫైవ్ స్టార్ హోటల్.. దానికి 24 గంటల పర్మిషన్ ఉంది. పార్టీకి వచ్చిన 148 మందిలో ఎవరి జేబులో డ్రగ్స్ ఉన్నాయో ఎవరు డ్రగ్స్ తెచ్చారో మాకు తెలియదు.148మందిలో ఎవరి బ్లడ్ లో డ్రగ్స్ ఉందో టెస్టులు చేయకుండా ఎలా పంపించేస్తారు. అందర్నీ వదిలేసి నా కొడుకుని మాత్రమే ఎందుకు వేధిస్తున్నారు అని ప్రశ్నించారు. పబ్బులో పని చేస్తున్నవారంతా గతంలో పబ్బుని నడిపిన యజమానుల మనుషులేనని చెప్పుకొచ్చారు శారద.

ఇవి కూడా చదవండి:

Hyderabad: తన కుమార్తె నిహారికపై వస్తున్న వార్తలపై నటుడు నాగబాబు క్లారిటీ

Hyderabad: ‘పబ్‌లో నేను లేను.. నన్నెందుకు బద్నాం చేస్తున్నారు’.. హేమ సూటి ప్రశ్న

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!