Rahul Sipligunj: రాత్రి పబ్‌లో ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పిన రాహుల్ సిప్లిగంజ్
బంజారాహిల్స్ పబ్‌లో డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నార్కోటిక్ వింగ్ రంగంలోకి దిగింది. పబ్ లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. పుడింగ్ అండ్ మింక్ పబ్ ను పరిశీలించి ఆధారాలు సేకరించారు.
Hyderabad: హైదరాబాద్ పబ్ వ్యవహారంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. 142 మంది లిస్ట్‌ను పోలీసులు విడుదల చేశారు. పార్టీకి హాజరైన వారిలో బిగ్ సెలబ్రిటీలు, ప్రముఖులు, ఉన్నతాధికారుల పిల్లలు కూడా ఉన్నారు. ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా పార్టీకి వెళ్లిన వాళ్లలో ఒకరు. ఈయన పార్టీకి ఎందుకు వచ్చారు. పబ్‌లో రాత్రి అసలేం జరిగింది.. అనే అంశాలపై రాహుల్ టీవీ9కు పూర్తి వివరాలు తెలిపారు. పబ్‌లో పార్టీకి కుటుంబంతో వెళ్లానని.. ఫ్యామిలీతో వీకెండ్ చిల్ కావడానికి వెళితే తప్పేంటని ప్రశ్నించారు. ఫ్రెండ్ పుట్టినరోజు కావడంతోనే వెళ్లినట్లు తెలిపారు. కొందరు పబ్ నుంచే పారిపోయారు కానీ తాను పోలీసుల విచారణకు పూర్తిగా సహకరించినట్లు వెల్లడించారు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని.. పబ్‌లో దొరికిన మాదక ద్రవ్యాలకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఏ విచారణకు అయినా సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. తన శాంపిల్స్ ఇవ్వడానికి ఎప్పుడైనా రెఢీ అన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే ఈ సారి తానే పట్టిస్తానని చెప్పారు. తప్పు చేయకపోయినా తనపై వివాదాలు సృష్టిస్తున్నారని రాహుల్ సిప్లిగంజ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ చెప్పిన పూర్తి వివరాలను దిగువ వీడియోలో చూడండి..
Also Read: Hyderabad: తన కుమార్తె నిహారికపై వస్తున్న వార్తలపై నటుడు నాగబాబు క్లారిటీ