AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: తన కుమార్తె నిహారికపై వస్తున్న వార్తలపై నటుడు నాగబాబు క్లారిటీ

రాడిసన్‌ బ్లూ పబ్‌ వ్యవహారంపై నటుడు నాగబాబు స్పందించారు. ఆ సమయంలో పబ్‌లో నిహారిక ఉండడం తాను రెస్పాండ్ అవుతున్నట్లు వెల్లడించారు.

Hyderabad: తన కుమార్తె నిహారికపై వస్తున్న వార్తలపై నటుడు నాగబాబు క్లారిటీ
Nagababu
Ram Naramaneni
|

Updated on: Apr 03, 2022 | 3:23 PM

Share

పుడింగ్ మింక్ పబ్  డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. సెలబ్రిటీలు, బడాబాబుల పిల్లలు ఉన్నారని తేలడంతో.. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న పబ్ పై గతంలో ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోకపోవడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బంజారాహిల్స్‌ ఏసీపీ, సీఐపై చర్యలు తీసుకున్నారు. పోలీస్‌ స్టేషన్‌ సీఐ శివచంద్రను స్పస్పెండ్‌ చేశారు. ఏసీపీ సుదర్శన్‌కు చార్చ్‌మెమో జారీచేశారు. డ్రగ్స్ వ్యవహారంపై వివరణ ఇవ్వాలంటూ ఏసీపీని ఆదేశించారు సీపీ సీవీ ఆనంద్. మరోవైపు ఈ పార్టీకి మెగా డాటర్ నిహారిక వెళ్లిన విషయాన్ని కన్ఫామ్ చేశారు నటుడు నాగబాబు. పరిమిత సమయాన్ని మించి.. రన్ చేసిన కారణంగా పోలీసులు పబ్‌పై యాక్షన్ తీసుకున్నారని తెలిపారు. పోలీసులు తమకు ఇచ్చిన సమాచారం మేరకు.. నిహారిక విషయంలో ఎటువంటి తప్పు లేదని చెప్పినట్లు నాగబాబు స్పష్టం చేశారు. దీనిపై ఎటువంటి స్పెక్యులేషన్స్ ప్రచారం చేయొద్దని  వీడియో ద్వారా కోరారు.

డ్రగ్స్‌పై ఉక్కుపాదమే అంటున్న తెలంగాణ సర్కార్…

ఈ పుడింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో చాలామంది సెలబ్రిటీలు, సినీ రాజకీయ ప్రముఖుల వారసులు ఉన్నట్లు తెలుస్తోంది. అంజన్‌ కుమార్‌ యాదవ్‌ కుమారుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తన కుమారుడు డ్రగ్స్‌ తీసుకున్నట్లైతే చర్యలు తీసుకోవాలన్నారు అంజన్‌. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారని అన్నారు.

ఇటు గల్లా కుటుంబం కూడా వివరణ ఇచ్చింది. గల్లా అశోక్‌ రాడిసన్‌ బ్లూ హోటల్‌ రెయిడ్‌లో పట్టుబడ్డారన్నది అవాస్తవమని ప్రకటించింది గల్లా ఫ్యామిలీ. అయితే పోలీసులు విడుదల చేసిన లిస్ట్‌ గల్లా అశోక్‌ పేరు లేదు. సిద్దార్థ్‌ గల్లా పేరు ఉంది.

మరోవైపు తెల్లారుజాము వరకు నిర్వహించిన పబ్‌లో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ కూడా ఉన్నారు. ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేసి పంపించేశారు. ఇంకోవైపు ప్రముఖ హీరో కుమార్తె కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు నోటీసులు ఇచ్చి పంపించేశారు. తమ ప్రభుత్వం డ్రగ్స్‌పై ఉక్కుమోపుతోంది కాబట్టే కేసులు బయటపడుతున్నాయన్నారు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌. తెలంగాణ పోలీసులు గోవా వరకు వెళ్లి కేసులను పట్టుకుంటున్నారన్నారు. పబ్బుల్లో డ్రగ్స్‌ దొరికితే కఠినచర్యలు తప్పవన్నారు శ్రీనివాస్‌ గౌడ్‌.

Also Read: Hyderabad: ‘పబ్‌లో నేను లేను.. నన్నెందుకు బద్నాం చేస్తున్నారు’.. హేమ సూటి ప్రశ్న

Follow Us
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
టెక్నో స్పార్క్ గో 3 ప్రో డిస్‌ప్లే, బ్యాటరీ సహా పూర్తి వివరాలు
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఒక్క రోజులోనే 10వేలు డైన్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు!
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
ఆ రోజే అకౌంట్లోకి తల్లికి వందనం నిధులు.. ప్రభుత్వం నుంచి అప్డేట్
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
కార్బన్ జెన్‌జె ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలివే
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
ఫాస్టెస్ట్ బాల్ వేసినోడు తెలుసు.. ఆడిన మొగోడు ఎవడో తెలుసా?
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
సైన్స్ కు అందని కదిరి లక్ష్మీనరసింహస్వామి శ్వేద రహస్యం
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
నిజమైన దెయ్యం సినిమా.. ఓటీటీలో ఎక్కువమంది చూసిన హారర్ థ్రిల్లర్
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
యాపిల్‌ కొత్త మోడల్‌ ఫోన్ గురించి ఆసక్తికర విషయం తెలుసా
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీ జర్నీ.. ప్రభుత్వం నంచి ప్రకటన..
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే
యాపిల్‌ మ్యూజిక్‌ యాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే