AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakul Preet Singh: నేను అభిమానించేది అతడినే.. ఫ్యాన్స్‌తో ఆసక్తికర విషయాలు పంచుకున్న రకుల్‌..

Rakul Preet Singh: సోషల్‌ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చిన తర్వాత అభిమానులకు, సినీ తారలకు మధ్య దూరం తగ్గిపోయింది. ఒకప్పుడు సినీ తారలను పేపర్లలో చూసుకొని మురిసిపోయేవారు. కానీ ఇప్పుడు..

Rakul Preet Singh: నేను అభిమానించేది అతడినే.. ఫ్యాన్స్‌తో ఆసక్తికర విషయాలు పంచుకున్న రకుల్‌..
Rakul
Narender Vaitla
|

Updated on: Apr 04, 2022 | 8:00 AM

Share

Rakul Preet Singh: సోషల్‌ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చిన తర్వాత అభిమానులకు, సినీ తారలకు మధ్య దూరం తగ్గిపోయింది. ఒకప్పుడు సినీ తారలను పేపర్లలో చూసుకొని మురిసిపోయేవారు. కానీ ఇప్పుడు నేరుగా తమ అభిమాన తారలతో మాట్లాడే రోజులు వచ్చేశాయి. సెలబ్రిటీలు కూడా తమ ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. సోషల్‌ మీడియాలో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెక్షన్ పేరుతో ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అందాల తార రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా ఫ్యాన్స్‌తో చిట్‌ చాట్‌ చేసింది. అభిమానులు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది.

ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ సమయంలో ఓ అభిమాని ‘మీరు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటి.? అని అడగ్గా.. ‘మీ అందరి ప్రేమ వల్లే అంటూ సమాధానం ఇచ్చింది. ఇక రకుల్‌కు ఇంట్లోనే చేసిన వంటకాలు అంటేనే ఎక్కువ ఇష్టంటూ తెలిపింది. తెలుగులో మీ అభిమాన హీరో ఎవరు అని అడిగిన ప్రశ్నకు.. అల్లు అర్జున్‌ అని సమాధానం ఇచ్చింది రకుల్‌. ట్రిపులార్‌ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఆ సినిమా గురించి చెప్పడానికి తన దగ్గర మాటల్లేవని, ఆర్‌ఆర్‌ఆర్‌లో ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారంటూ’ చెప్పుకొచ్చింది. డీడీఎల్‌జే లాంటి ఎప్పటికీ గుర్తుండిపోయే ఓ అందమైన ప్రేమ కథలో నటించడమే తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అని చెప్పుకొచ్చింది రకుల్‌.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

ఇదిలా ఉంటే రకుల్‌ ఇటీవల బాలీవుడ్‌లో ‘అటాక్‌’ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాలో రకుల్‌కు మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి. ఇక ప్రస్తుతం 31 అక్టోబర్‌ లేడిస్‌ నైట్‌ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాను ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమా రకుల్‌ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

Also Read: Matti Water Fest: కర్నూలు జిల్లాలో వినూత్న ఉగాది వేడుకలు.. ఒళ్లంతా బురద రాసుకుని..

Indian Army: భారత కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండేకు ఛాన్స్.. సీడీఎస్ రేసులో నరవాణే!

Train Accident: నాసిక్‌లో తప్పిన పెను ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు.. కొనసాగుతున్న సహాయకచర్యలు