Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RGV Dhahanam: ‘ఎక్కడ హింస ముగుస్తుందో అక్కడ దహనం మొదలవుతుంది’.. వర్మ మార్క్‌ కొత్త వెబ్‌ సిరీస్‌..

RGV Dhahanam: రామ్‌గోపాల్‌ వర్మ సంచనాలకు పెట్టింది పేరు. ఈ దర్శకుడి నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు అంచనాలతో పాటు కాంట్రవర్సీలూ ఉంటాయి. సినిమా టైటిల్‌ ప్రకటించింది మొదలు విడుదల వరకు నిత్యం ఒక వార్త..

RGV Dhahanam: 'ఎక్కడ హింస ముగుస్తుందో అక్కడ దహనం మొదలవుతుంది'.. వర్మ మార్క్‌ కొత్త వెబ్‌ సిరీస్‌..
Rgv Dhahanam Trailer
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 04, 2022 | 7:24 AM

RGV Dhahanam: రామ్‌గోపాల్‌ వర్మ సంచనాలకు పెట్టింది పేరు. ఈ దర్శకుడి నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు అంచనాలతో పాటు కాంట్రవర్సీలూ ఉంటాయి. సినిమా టైటిల్‌ ప్రకటించింది మొదలు విడుదల వరకు నిత్యం ఒక వార్త హల్చల్‌ చేస్తూనే ఉంటుంది. వర్మ దర్శకత్వం వహించిన సినిమాలే కాకుండా నిర్మాతగా వ్యవహరించిన చిత్రాలు సైతం కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలుస్తుంటాయి. ఇలా వర్మ ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుల్లో అగస్త్య మంజు ఒకరు. ప్రస్తుతం ఇతని డైరెక్షన్‌లోనే ‘దహనం’ అనే వెబ్‌ సిరీస్‌ తెరకెక్కింది. ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌లో ఏప్రిల్‌ 14 నుంచి ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ వర్మ కొన్ని రోజుల క్రితం ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఎక్కడ హింస ముగుస్తుందో అక్కడ దహనం మొదలవుతుంది’ అంటూ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌ తేదీని ప్రకటించారు.

ఇదిలా ఉంటే తాజాగా చిత్ర యూనిట్ ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ను గమినిస్తే సిరీస్‌ మొత్తం పగా, ప్రతీకారం నేపథ్యంలో తెరకెక్కినట్లు కనిపిస్తోంది. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని తపించే ఓ కొడుకు కథలా కపిస్తోంది. తన తండ్రిని చంపిన వారిపై కొడుకు పగను ఎలా తీర్చుకున్నాడనేదే వెబ్‌ సిరీస్‌ కథాంశంగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ ట్రైలర్‌ను గమనిస్తుంటే వర్మ గతంలో తెరకెక్కించిన ‘రక్త చరిత్ర’ను పోలినట్లుంది. వర్మ మరోసారి పరిటాల కుటుంబ నేపథ్యంగా వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిస్తున్నారా? అన్న అనుమానం కలగక మానదు. అయితే ఈ విషయాన్ని వర్మకానీ, చిత్ర యూనిట్ కానీ ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.

మరి ఈ కథ కేవలం కల్పితమా.. లేదా నిజంగా జరిగిన కథాంశమా తెలియాలంటే సిరీస్‌ విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఇక పూర్తి యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ సిరీస్‌ మొత్తం ఏడు ఎపిసోడ్‌లుగా స్ట్రీమింగ్‌ కానుంది. ఇషా కొప్పికర్, అభిషేక్‌, నైనా గంగూలీ, అశ్వత్‌ కాంత్‌ శర్మ, అభిలాష్‌ చౌదరి, పార్వతి అరుణ్, సయాజీ షిండే, ప్రదీప్‌ రావత్‌లు కీలక పాత్రల్లో నటించారు. మరి ఈ ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి..

Also Read: గుడ్‌న్యూస్‌.. పాన్‌-ఆధార్‌ అనుసంధానం గడువు పొడిగింపు.. కానీ..

Astro: శనిదోషాలతో ఇబ్బందిపడుతున్నారా.. ఇలా చేస్తే అంతా శుభమే..!

Dangerous Shark: ఆ నదిలో ప్రమాదకరమైన సొరచేప.. కొరికిందంటే క్షణాల్లో మరణం..!

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..