Aha Indian Idol: ఆహా ఇండియన్‌ ఐడల్‌లో మొదటి ఎలిమినేషన్‌.. షో నుంచి నిష్క్రమించింది ఎవరో తెలుసా.?

Aha Indian Idol: తొలి తెలుగు ఓటీటీ ఆహా (AHA OTT) వేదికగా టెలికాస్ట్‌ అవుతోన్న ఇండియన్‌ ఐడల్‌ భారీగా వ్యూస్‌ దక్కించుకుంటూ దూసుకుపోతోంది. తెలుగు సింగర్స్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ సింగింగ్‌ షోకు..

Aha Indian Idol: ఆహా ఇండియన్‌ ఐడల్‌లో మొదటి ఎలిమినేషన్‌.. షో నుంచి నిష్క్రమించింది ఎవరో తెలుసా.?
Aha Indian Idol
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 04, 2022 | 11:50 AM

Aha Indian Idol: తొలి తెలుగు ఓటీటీ ఆహా (AHA OTT) వేదికగా టెలికాస్ట్‌ అవుతోన్న ఇండియన్‌ ఐడల్‌ భారీగా వ్యూస్‌ దక్కించుకుంటూ దూసుకుపోతోంది. తెలుగు సింగర్స్‌ను ప్రపంచానికి పరిచయం చేస్తున్న ఈ సింగింగ్‌ షోకు అనూహ్య స్పందన లభిస్తోంది. వేలాది మంది ఆడిషన్స్‌కు హాజరుకాగా వారిలో నుంచి స్క్రీనింగ్ చేస్తూ చివరికి 12 మందిని టాప్‌ లిస్ట్‌కు చేర్చారు. ఈ 12 మంది మధ్య పోటీ కొనసాగింది. థమన్, కార్తిక్‌, నిత్యా మీనర్‌ జడ్జీలుగా వ్యవహరిస్తున్న ఈ షో విజయవంతంగా 10 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది.

ఈ నేపథ్యంలోనే షోలో ఎలిమినేషన్‌ ప్రక్రియ ప్రారంభమైంది. 12 మంది కంటెస్టెంట్‌లలో ఒకరు ఎలిమినేట్‌ అయ్యారు. జడ్జీల అభిప్రాయాలు, కంటెస్టెంట్‌లకు ప్రేక్షకుల నుంచి వచ్చిన ఓట్ల ఆధారంగా 12 మందిలో తక్కువ ప్రతిభను కనబరిచిన ముగ్గురు జాబితాను ముందుగా ప్రకటించారు. మాన్య చంద్రన్‌, జస్‌కరణ్‌ సింగ్‌, మారుతి ఈ లిస్ట్‌లో ఉన్నారు. అయితే తాజాగా ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో ఈ ముగ్గురిలో జస్‌కరన్‌ సింగ్‌ ఎలిమినేట్‌ అవుతున్నట్లు హోస్ట్‌ ప్రకటించాడు.

Aha

అలాగే జెప్టో కంసిస్టెంట్‌ పర్మాఫర్‌ ఆఫ్‌ ది వీక్‌ అవార్డును వైష్ణవి దక్కించుకుంది. ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలు కాగానే ఇండియన్‌ ఐడల్‌ షో మరింత ఆసక్తికరంగా సాగింది. ఫైనల్‌కు ఎవరు చేరుకుంటారా? అన్న ఆసక్తి అందరిలోను నెలకొంది. ప్రస్తుతం షోలో శ్రీనివాస్‌, వాగ్దేవి, వైష్ణవి కొవ్వురి, మారుతి, రేణు కుమార్, లాలస, ప్రణతి, అదిథి భవరాజు, మాన్య చంద్రన్‌, చిట్టా లక్ష్మీ శ్రావణి, జయంత్‌ మధుర్‌ ఉన్నారు.

Also Read: Ramadan 2022: సెహ్రీ, ఇఫ్తార్‌ విందులో ఖర్జూరాలు తప్పనిసరిగా తింటారు? ఎందుకో తెలుసా..

Hebba Patel: అడగకూడని ప్రశ్న అడిగిన ఫ్యాన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన హీరోయిన్..తగ్గేదేలే..

Andhra Pradesh: ఇకపై ఏపీలో 26 జిల్లాలు.. కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్