Drugs: ఆల్ప్రాజోలం, పారాసెట్‌మాల్ మాత్రలతో డ్రగ్స్ తయారీ.. 151 కిలోల బ్రౌన్ షుగర్ స్వాధీనం

Drugs Seized: భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. డ్రగ్స్ తయారు చేసి పలు రాష్ట్రాలకు తరలిస్తున్న ఐదుగురు నిందితులను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.15 కోట్ల విలువైన

Drugs: ఆల్ప్రాజోలం, పారాసెట్‌మాల్ మాత్రలతో డ్రగ్స్ తయారీ.. 151 కిలోల బ్రౌన్ షుగర్ స్వాధీనం
Drugs
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 04, 2022 | 9:44 AM

Drugs Seized: భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. డ్రగ్స్ తయారు చేసి పలు రాష్ట్రాలకు తరలిస్తున్న ఐదుగురు నిందితులను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.15 కోట్ల విలువైన 151 కిలోల సింథటిక్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతోపాటు నాలుగు లక్షల నగదు, డబ్బు లెక్కించే మిషన్, అదేవిధంగా పలు ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, ముజఫర్‌పూర్ నుండి తెచ్చిన ఆల్ప్రాజోలం, పారాసెటమాల్ మాత్రలు.. ఇతర మాదక ద్రవ్యాలను ఉపయోగించి RNT మార్గ్ ప్రాంతంలోని పౌల్ట్రీలో బ్రౌన్ షుగర్ రూపంలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. మొదట ఇద్దరిని అరెస్ట్ చేసిన చందన్ నగర్ (Madhya Pradesh) పోలీసులు.. నిందితులు ఇచ్చిన సమాచారంతో మరికొన్ని చోట్ల దాడులు చేసి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.

డీసీపీ ప్రశాంత్ చౌబే తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూర్ సమీపంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కిలో డ్రగ్స్‌తో పట్టుకున్నారు. ఈ ఘటనలో కార్తీక్ బాఘెల్, మహ్మద్ ఆరిఫ్ అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత వారిచ్చిన సమాచారంతో మరికొన్ని చోట్ల దాడులు నిర్వహించి అజయ్ జాదూన్, కోమల్ సహారియా, దినేష్ రాథోడ్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి వద్ద నుండి రూ.15 కోట్ల విలువైన 151 కిలోల సింథటిక్ డ్రగ్స్‌ను పట్టుబడినట్లు తెలిపారు.

నిందితులు యూపీ నుంచి ముడిసరుకును తీసుకొచ్చి డ్రగ్స్ తయారు చేసేవారని తెలిపారు. ఆ తర్వాత రాష్ట్రంలోని పలు నగరాలతో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్‌లకు సరఫరా చేసేవారని పోలీసులు పేర్కొన్నారు. వీరికి సహకరించిన వారి కోసం కూడా గాలిస్తున్నట్లు తెలిపారు.

Also Read:

AP Crime News: బెజవాడలో దారుణం.. కన్నతండ్రిని చంపిన దుర్మార్గుడు.. అడ్డుకోబోయిన శునకంపై..

Hyderabad: మానవత్వం ఎక్కడ..? అంగవైకల్యం ఉందని 3 రోజుల బాలుడిని కవర్‌లో పెట్టి వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు