మృత్యుశకటంలా దూసుకువచ్చిన లారీ.. మూసీ కాల్వలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్న తండ్రీ కొడుకులు!

అకస్మాత్తుగా మీదికి దూసుకొస్తున్న లారీని తప్పించుకునేందుకు పక్కనున్న కాల్వలోకి దూకి తండ్రీకుమారుడు ప్రాణాలు దక్కించుకున్నారు.

మృత్యుశకటంలా దూసుకువచ్చిన లారీ.. మూసీ కాల్వలోకి దూకి ప్రాణాలు కాపాడుకున్న తండ్రీ కొడుకులు!
Road Accident
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 04, 2022 | 9:53 AM

Road Accident: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. అకస్మాత్తుగా మీదికి దూసుకొస్తున్న లారీని తప్పించుకునేందుకు పక్కనున్న కాల్వలోకి దూకి తండ్రీకుమారుడు ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట(Suryapet) సమీపంలోని బీబీగూడెం శివారులో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం బండమీది చందుపట్లకు చెందిన రాచకొండ రామకృష్ణ, తన కుమారుడు నవీన్‌తో కలిసి ద్విచక్రవాహనంపై సూర్యాపేటకు వెళ్తున్నారు. బీబీగూడెం శివారులో మూసీ కాల్వ వద్ద.. ముందు పోతున్న లారీ బైపాస్‌ రోడ్డు వైపునకు తిరుగుతుండగా తమ వాహన వేగాన్ని నియంత్రించుకున్నారు. ఆ వెనకే వస్తున్న కంటైనర్‌ లారీ వేగంగా వీరి మీదకు దూసుకు వచ్చింది.

ఇద గమనించిన రామకృష్ణ, నవీన్‌లు ఎటూ వెళ్లలేక వారిద్దరు పక్కనే ఉన్న మూసీ కాల్వలోకి దూకారు. వీరు కాల్వలోకి దూకడం, ఆ వెంటనే ద్విచక్రవాహనంపై లారీ ఎక్కడం క్షణాల్లో జరిగిపోయింది. కాల్వలో నీళ్లు ఉండటంతో ఈదుకుంటూ తండ్రీకుమారుడు ఒడ్డుకు చేరుకున్నారు. కాల్వ వంతెనపై ప్రమాదం జరగడంతో వాహనాల రాకపోకలకు గంటపాటు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కంటైన్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also…  Viral Video: యుద్ధానికైనా రెడీ… దాన్ని మాత్రం వదలను.. మొసలికి పిల్లి ఛాలెంజ్‌..! వీడియో చూస్తునంతసేపు నవ్వు ఆగదు..