Viral Video: యుద్ధానికైనా రెడీ... దాన్ని మాత్రం వదలను.. మొసలికి పిల్లి ఛాలెంజ్‌..! వీడియో చూస్తునంతసేపు నవ్వు ఆగదు..

Viral Video: యుద్ధానికైనా రెడీ… దాన్ని మాత్రం వదలను.. మొసలికి పిల్లి ఛాలెంజ్‌..! వీడియో చూస్తునంతసేపు నవ్వు ఆగదు..

Anil kumar poka

|

Updated on: Apr 05, 2022 | 9:26 AM

సాధారణంగా మొసలిని దూరం నుంచి చూస్తేనే భయపడిపోతుంటాం. అలాంటిది దాని దగ్గరకు వెళ్లాలంటే.? ఇంకేమైనా ఉందా.? గుండె ఆగిపోయినట్లే.. అయితే ఇక్కడొక పిల్లి ఏకంగా తన ఆహారం కోసం మొసలితోనే తలపడటానికి సిద్ధపడింది.


సోషల్ మీడియాలో తాజాగా ఓ షాకింగ్‌ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఇది ఒక మొసలి-పిల్లికి సంబంధించిన వీడియో. సాధారణంగా మొసలిని దూరం నుంచి చూస్తేనే భయపడిపోతుంటాం. అలాంటిది దాని దగ్గరకు వెళ్లాలంటే.? ఇంకేమైనా ఉందా.? గుండె ఆగిపోయినట్లే.. అయితే ఇక్కడొక పిల్లి ఏకంగా తన ఆహారం కోసం మొసలితోనే తలపడటానికి సిద్ధపడింది. వైరల్ అవుతున్నఈ వీడియోలో.. ఓ సరస్సు దగ్గర మొసలి ఒడ్డున సేద దీరుతోంది. దాని నోటి ముందు ఓ చేప పడి ఉంది. చేపలను చూస్తే చాలు పిల్లులకు నోరూరుతుంది. ఎప్పుడు గుటుక్కుమనిపిద్దామా అని చూస్తుంది. ఆ మొసలి దగ్గర ఉన్న చేపను అటుగా వచ్చిన ఓ పిల్లి చూసింది. ఇంకేముంది తనకిష్టమైన ఆహారాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని.. మొసలితో యుద్దానికైనా సిద్దమంటూ.. నెమ్మదిగా మొసలి దగ్గరకు వెళ్తుంది. ఒక కంటితో మొసలిని గమనిస్తూనే.. మరో కంటితో చాకచక్యంగా చేపను నోట కరుచుకుని అక్కడ నుంచి జారుకుంటుంది. మొసలికి ఏమైదో తెలియదు కానీ.. పాపం అలా చూస్తుండి పోయింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, ఈ వైరల్ వీడియోను ఒక ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ‘బ్రేవ్ క్యాట్’ అనే క్యాప్షన్‌తో అప్‌లోడ్ చేసారు. కాగా ఈ వీడియోను లక్షల మంది వీక్షిస్తూ వేలల్లో లైక్ చేస్తున్నారు. అంతేకాదు… పిల్లి టాలెంట్‌కి ఫిదా అవుతూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Dog singing Video: వావ్ వాట్ ఏ సింగింగ్ రెయ్.. పియానో వాయిస్తూ పాటపాడిన శునకం.. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..

Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్‌..

అయ్యాయో పాపం.. అమ్మాయి ముందు పరువు పాయే..! మైకేల్‌ జాక్సన్‌ స్టెప్‌ వేద్దామనుకున్నాడు సీన్ రివర్స్‌…

Viral Video: అయ్యా..! చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిన 200 మంది.. వీడియో చుస్తే షాక్ అవుతారు..

Funny Video: చిన్న పిల్లలా ఎంజాయ్‌ చేద్దామనుకుంటే సీన్‌ రివర్స్‌ అయిందిగా…! నవ్వులు పూయిస్తున్న వీడియో…

Wedding Viral Video: లవ్లీ సర్ ప్రైజ్ ఇచ్చిన వరుడు..నవ వధువు ఫిదా! ఈ వీడియోకు లైకుల వర్షం..

Viral Video: పాములు ఇలా కూడా పగ పడతాయా..? ఏడు నెలల్లో మూడు సార్లు కాటు.. యువతిని వెంటాడిన పాము