Dangerous Shark: ఆ నదిలో ప్రమాదకరమైన సొరచేప.. కొరికిందంటే క్షణాల్లో మరణం..!
Dangerous Shark: సముద్రంలో అనేక జీవులు కనిపిస్తాయి. అందులో కొన్ని జీవుల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక నివేదిక ప్రకారం.. ప్రపంచంలో 33 వేల కంటే ఎక్కువ జాతుల చేపలు ఉన్నాయి.
Dangerous Shark: సముద్రంలో అనేక జీవులు కనిపిస్తాయి. అందులో కొన్ని జీవుల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఒక నివేదిక ప్రకారం.. ప్రపంచంలో 33 వేల కంటే ఎక్కువ జాతుల చేపలు ఉన్నాయి. ఈ చేపలలో 200 నుంచి 400 జాతుల చేపల గురించి ఎవ్వరికీ తెలియదు. అయితే ఇందులో కొన్ని జీవులు చాలా ప్రమాదకరమైనవి. ఇవి మనుషులకి హాని చేస్తాయి. ముఖ్యంగా షార్క్ చేప తన పదునైన దంతాలు, వేగంతో ఎవరినైనా ఓడించగలదు. అలాంటి ప్రమాదకరమైన సొరచేప ఒకటి వెలుగులోకి వచ్చింది. దీని విషం క్షణాల్లో ప్రాణాలు తీస్తుంది. ఆంగ్ల వెబ్‌సైట్ డైలీ స్టార్ నివేదిక ప్రకారం.. ఈ చేప యునైటెడ్ కింగ్‌డమ్‌లోని థేమ్స్ నదిలో కనిపిస్తుంది. ఇది షార్క్ జాతి. దీనిని స్పైనీ డాగ్ ఫిష్ లేదా స్పర్డాగ్ షార్క్ అంటారు.
ఈ సొరచేప పై భాగంలో వెన్నెముక ఉంటుంది. దానికి ఏదైనా ప్రమాదం అనిపించినప్పుడు దానిని బంతిలా గుండ్రంగా తిప్పుతుంది. ఎందుకంటే దాని ద్వారా విషాన్ని వెలువరిస్తుంది. దీని విషం చాలా ప్రమాదకరమైనది. అది మానవ శరీరంలోకి ప్రవేశిస్తే క్షణాల్లో మరణం సంభవిస్తుంది. ఆ వ్యక్తి భరించలేని నొప్పిని అనుభవిస్తాడు. ఈ చేప ఎగువ భాగం బూడిద-గోధుమ రంగులో ఉంటుంది. ఈ చేప నోరు చాలా పదునైనది. కళ్ళు చాలా పెద్దవి. దీని శరీరంపై చాలా చారలు ఉంటాయి. ఇప్పటికే దీనిని బ్రిటన్‌లోని విషపూరిత చేపల జాబితాలో చేర్చారు. ఇది కాకుండా మరో రెండు డేంజర్ చేపలు స్టింగ్ రే, వీవర్ చేపలు కూడా ఈ నదిలో కనిపిస్తాయి.
The spurdog shark, also known as the spiny dogfish are vulnerable to overfishing and here in the UK the population has fallen by 95% in the last 100 years. ?? But the waters around Mull are great for them! #Autumnwatch ? Dr Charles McGurk pic.twitter.com/fKHkwWkUE1
— BBC Springwatch (@BBCSpringwatch) November 27, 2021